Site icon HashtagU Telugu

Mahesh Babu : ‘ఫిదా’ సినిమాని మహేష్ బాబు వదులుకున్నాడు తెలుసా? ఎందుకంటే..?

Mahesh Babu missed Fidaa Movie do you know reason why

Mahesh Babu missed Fidaa Movie do you know reason why

శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో వరుణ్ తేజ్(Varun Tej), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా వచ్చిన సినిమా ఫిదా(Fidaa). ఒక మంచి లవ్ స్టోరీగా ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమాతోనే సాయి పల్లవి తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో సాయి పల్లవికి బాగా పేరు వచ్చింది. భానుమతి – ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల అనే డైలాగ్ తో సాయి పల్లవి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది తెలుగులో.

అయితే ఈ సినిమా మహేష్ బాబు(Mahesh Babu) చేయాల్సింది అట. మహేష్ బాబుకి మొదట కథ వినిపించాడు శేఖర్ కమ్ముల. కానీ చివరకు ఇది వరుణ్ తేజ్ దగ్గరకు వచ్చింది. దాని గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు శేఖర్ కమ్ముల.

శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. నేను ప్రేమ కథలు బాగా రాసుకొని, బాగా తెరకెక్కిస్తానని నమ్మకం ఉంది. అలా రాసుకున్న కథే ఫిదా. ఫిదా కథ మీద చాలా నమ్మకంగా ఉన్నాను. ఫిదా సినిమాను ముందు మహేష్ బాబు గారికే చెప్పాను. ఆయనకు స్టోరీ నచ్చింది అని చెప్పి కొన్ని మార్పులు చెప్పారు. ఈ సినిమా చేద్దాం అన్నారు. కానీ ఆయన స్టార్ హీరో కావడంతో అప్పటికే చాలా సినిమాలు ఉన్నాయి, డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయారు. ఆయన సినిమాల రిలీజ్ లని బట్టి కూడా ఆయన డేట్స్ మారిపోతాయి. దీంతో కొన్నాళ్ళు వెయిట్ చేసినా మహేష్ గారు డేట్స్ ఇవ్వలేకపోయారు. ఆయన కూడా నన్ను వెయిట్ చేయించడం ఇష్టం లేక కథ నచ్చినా డేట్స్ లేకపోవడం వల్ల ఈ సినిమా చేయలేకపోతున్నాను అని చెప్పారు. ఆ తర్వాత నేను వరుణ్ తేజ్ దగ్గరికి వెళ్ళాను అని తెలిపారు.

దీంతో మహేష్ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక మంచి సినిమా మహేష్ బాబు మిస్ అయ్యాడని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే, ఈ సినిమా మిస్ అవ్వడం మంచిదే అయింది, ఈ సినిమా వల్ల హీరోయిన్ కి పేరు వచ్చింది, హీరోకి అసలు గుర్తింపు రాలేదు, ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అని మహేష్ అభిమానులు అంటున్నారు. ఇక సాయి పల్లవి ఫ్యాన్స్ మహేష్ తో సినిమా మిస్ అయిందని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా మహేష్ చేస్తే ఎలా ఉండేదో..

 

Also Read : Kushi Second Song: వావ్ వాట్ ఏ లవ్ లీ సాంగ్.. ఖుషి నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్!