Mahesh Babu : మహేష్ మంజుల వైరల్ అవుతున్న వీడియో..!

Mahesh Babu రాజమౌళి సినిమా కోసం మహేష్ లాంగ్ హెయిర్ పెంచుకుంటున్నాడు. మొన్నటిదాకా క్యాప్ పెట్టుకుని కనిపించిన మహేష్

Published By: HashtagU Telugu Desk
Mahesh Babu Meets Sister Manjula In A Marriage Event

Mahesh Babu Meets Sister Manjula In A Marriage Event

Mahesh Babu సూపర్ స్టార్ మహేష్ లాంగ్ హెయిర్ లుక్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. రాజమౌళి సినిమా కోసం మహేష్ లాంగ్ హెయిర్ పెంచుకుంటున్నాడు. మొన్నటిదాకా క్యాప్ పెట్టుకుని కనిపించిన మహేష్ ఇప్పుడు క్యాప్ లేకుండా లాంగ్ హెయిర్ తో దర్శనమిస్తున్నాడు. ఈమధ్యనే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో కలిసి ఒక ఫోటో సెషన్ లో పాల్గొన్న మహేష్ లేటెస్ట్ గా హైదరాబాద్ లో ఒక పెళ్లిలో కనిపించారు.

తెలిసిన వాళ్ల పెళ్లి అవ్వడంతో ఫ్యామిలీ మొత్తం పెళ్లికి వెళ్లారు. లాంగ్ హెయిర్ తో మహేష్ లుక్ అదిరిపోయింది. ఇక ఇదే పెళ్లికి మహేష్ సోదరి మంజుల కూడా అటెండ్ అయ్యింది. మహేష్ ని చూడగానే దగ్గరకు వెళ్లి అతని జుట్టుని టచ్ చేసింది. మహేష్ ఆమెను వద్దు అన్నట్టుగా చెప్పాడు. ఇద్దరు నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది.

మహేష్ తో మంజుల నాని సినిమా నిర్మించిందని తెలిసిందే. నిర్మాతగా కొనసాగాలని మంజులకు ఉన్నా కూడా ఆమె ఎందుకో వెనక్కి తగ్గారు.

ఇక ఇదే పెళ్లి వేడుకలకు కృష్ణమ్రాజు సతీమణి స్యామలా దేవి కూడా వచ్చారు. మహేష్ కనిపించగానే ఆమె దగ్గరకు తీసుకున్నారు. మహేష్ కూడా ఆమె దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా మాట్లాడారు. ప్రస్తుతం మహేష్ కు సంబందించిన ఈ ఫోటోలు, వీడియోలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

  Last Updated: 29 Apr 2024, 10:50 AM IST