Site icon HashtagU Telugu

Mahesh Babu : సీఎం రేవంత్ రెడ్డి కి చెక్ అందించిన మహేష్ బాబు

Mahesh Cmrevanth

Mahesh Cmrevanth

Mahesh Babu Meets CM Revanth Reddy : సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తన సతీమణితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ని కలిశారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు , వరదల కారణంగా అపార నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల వరద బాధితులకు సాయం చేసేందుకు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ సైతం రెండు తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయాల విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు యాభై లక్షల చొప్పున కోటి విరాళం ప్రకటించాడు. ఆ విరాళాన్ని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి అందజేసేందుకు సీఎం రేవంత్ రెడ్డిని కలిశాడు.

ఈరోజు జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ ఇంటికి మహేష్ బాబు తన సతీమణి నమత్రతో కలిసి వచ్చారు. ఈ సందర్బంగా సీఎం కు తన వంతు సాయంగా రూ.50 లక్షల రూపాయలతో (Cheque For Rs 50 lakh) పాటు AMB తరపున మరో రూ. 10లక్షల చెక్ ను అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహేష్ బాబు దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. “ఇలాంటి సమయంలో సినీ నటులు కూడా తమ వంతు సహాయాన్ని అందించడంలో ముందుండటం గర్వకారమని.. మహేష్ నమ్రత దంపతులను అభినందించారు. మహేష్ బాబు చేసిన ఈ సహాయం పునరావాస కార్యక్రమాలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ఈ భేటీలో సీఎం గానీ, విరాళం గానీ వైరల్ అవ్వడం లేదు. మహేష్ బాబు లుక్ (Mahesh Look) చూసి అంతా ఫిదా అవుతున్నారు. ఇలా పూర్తిగా మహేష్ బాబు తన లుక్‌ను చూపించడం ఇదే మొదటి సారి. సీఎం రేవంత్ వల్ల ఈ లుక్ బయటకు వచ్చిందని ఫ్యాన్స్ అంటున్నారు. రాజమౌళి మూవీ కోసం మహేష్ బాబు మేకోవర్‌ను పూర్తిగా మార్చేశాడు. అలా మహేష్ తన లుక్‌ను బయటకు రానివ్వకుండా జాగ్రత్తగానే ఉంటున్నాడు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లి చెక్‌ను అందజేసిన టైంలో ఇలా పూర్తి లుక్ బయటకు వచ్చేసింది. మహేష్ లాంగ్ హెయిర్, గుబురు గడ్డం చూస్తుంటే హాలీవుడ్ హీరోల ఉన్నాడని అంత కామెంట్స్ వేస్తున్నారు. ఇక రాజమౌళి – మహేష్ మూవీ దసరా సందర్బంగా ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుంది.

Read Also : Sundar Pichai: ప్రజల కోసం AI పని చేసేలా ప్రధాని మోదీ మమ్మల్ని ముందుకు తెస్తున్నారు