Mahesh Babu: సమ్మర్ స్పెషల్.. ఫ్యామిలీతో కలిసి హాలిడేస్ కు వెళ్తున్న మహేష్ బాబు?

  • Written By:
  • Publish Date - March 24, 2024 / 12:20 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరసగా సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ వయసులో కూడా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ 25 ఏళ్ల యుక్త వయసు ఉన్న కుర్రాడిలా కనిపిస్తూ అమ్మాయిలను, అబ్బాయిలను ఆశ్చర్య పరుస్తున్నారు. ఇటీవల గుంటూరు కారం సినిమాలో ప్రేక్షకులను పలకరించిన మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిపోయే సినిమాకు సంబంధించిన పనులను చూసుకుంటూ బిజీబిజీగా ఉన్నారు.

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ సమయం దొరికినప్పుడల్లా తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లకు వెళుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు మహేష్ బాబు. ఇక ప్రస్తుతం సమ్మర్ కావడంతో మొన్నటి వరకు సినిమాలకు సంబంధించిన విషయాలలో బిజీ బిజీగా గడిపిన మహేష్ బాబు కాస్త సమయం దొరకడంతో వెంటనే ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు బయలుదేరారు. అందులో భాగంగానే తాజాగా ఎయిర్ పోర్టుకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవ్వడంతో ఆ వీడియోలో మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి మరోసారి వెకేషన్ ట్రిప్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

ఆ వీడియో వైరల్ అవడంతో నేటిజన్స్ అభిమానులు కామెంట్లు చేస్తూ వెకేషన్ కి వెళ్తున్నారు అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే మహేష్ బాబు తదుపరి సినిమాల విషయానికి వస్తే.. మహేష్ నెక్స్ట్ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను రూపొందించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి.. వీలైనంత తొందరగా వాటిని పూర్తి చేసి ఈ సినిమాను మొదలు పెట్టాలని భావిస్తున్నారు రాజమౌళి. ఇప్పటికీ మూవీ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.