Site icon HashtagU Telugu

SSMB29 : పాన్ వరల్డ్ వైడ్ గా సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్న మహేష్ బాబు

Maheshbabu, Rajamouli

Maheshbabu, Rajamouli

సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శక ధీరుడు రాజమౌళి (Mahesh-Rajamouli) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న SSMB 29 చిత్రం పాన్‌ ఇండియా స్థాయిని దాటి, పాన్‌ వరల్డ్‌ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో భారత సినిమాకు కొత్త దిశ చూపిన రాజమౌళి, ఈసారి తన దృష్టిని అంతర్జాతీయంగా మరింత విస్తరించారు. ఇప్పటికే కెన్యాలోని పలు ప్రదేశాలను చిత్రీకరణ కోసం ఎంపిక చేసిన రాజమౌళి, ఆ దేశ క్యాబినెట్ సెక్రటరీ ముసాలియా ముదవాదిని కలవడం ద్వారా ఈ ప్రాజెక్ట్‌పై ప్రపంచ వ్యాప్తంగా అంచనాలను మరింత పెంచేశారు.

ఈ చిత్రాన్ని 120 దేశాలలో ఒకేసారి విడుదల చేయనున్నట్లు కెన్యా మంత్రి వెల్లడించడం సినీ ప్రపంచంలో పెద్ద చర్చనీయాంశమైంది. 100 కోట్ల మందికి పైగా ప్రేక్షకులు ఈ సినిమాను చూడబోతారని ఆయన తెలిపిన విషయం, మహేష్ బాబు కెరీర్‌కి కొత్త రికార్డులను తెచ్చిపెట్టడం ఖాయం. గ్లోబల్ స్థాయిలో ఇంతటి భారీ అంచనాలను తెచ్చుకున్న తెలుగు సినిమా ఇదే కావడం గర్వకారణం. కెన్యాలో చిత్రీకరణ జరగడం, ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా ఆనందం వ్యక్తం చేయడం కూడా ఈ సినిమాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.

CM Revanth : ఎట్టకేలకు నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

మహేష్ బాబు సరసన బాలీవుడ్‌ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, తమిళ నటుడు మాధవన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కథ, తారాగణం, సాంకేతిక నిపుణుల పరంగా అత్యున్నత స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీ విడుదలయ్యే సరికి ప్రపంచ సినిమా చరిత్రలో కొత్త రికార్డులు సృష్టించనుందని అభిమానులు నమ్ముతున్నారు.