Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలోనే కాకా పలు బిజినెస్ లతో కూడా సంపాదిస్తున్నారు. అనేక రకాల బిజినెస్ లలో పెట్టుబడులు పెట్టారు మహేష్. AMB థియేటర్స్, రెస్టారెంట్స్, క్లాతింగ్ బిజినెస్.. ఇలా పలు రంగాలలో మహేష్ పెట్టుబడులు పెట్టారు. తాజాగా మరో రంగంలో మహేష్ పెట్టుబడులు పెట్టారు.
ఫిట్ డే అనే స్టార్టప్ కంపెనీలో మహేష్ బాబు పెట్టుబడులు పెట్టారు. ఈ విషయం ఆ కంపెనీ తమ వెబ్ సైట్ లో అధికారికంగా ప్రకటించింది. ఫిట్ డే ఆరోగ్యానికి సంబంధించిన ఫుడ్, ప్రోటీన్ ఫుడ్, మిల్లెట్స్ ఫుడ్ తయారుచేసే ఓ కంపెనీ. ప్రొటీన్ పౌడర్, చిప్స్, చిక్కి.. ఇలా రకరకాల ఫుడ్ ఐటమ్స్ ని ఫిట్ డే ఉత్పత్తి చేస్తుంది. ఆరోగ్యం కోసం ఈ ఫుడ్ తీసుకోమని ఫిట్ డే ప్రమోట్ చేస్తుంది. ఇది ఇండియాలో ఒక చిన్న స్టార్టప్ కంపెనీ. ఇప్పుడు మహేష్ బాబు ఈ స్టార్టప్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి ఒక్కసారిగా దీని రేంజ్ పెంచేసాడు.
ఎంతో ఫిట్ గా, ఎంత ఏజ్ పెరిగినా ఇంకా యువకుడిగా కనిపించే మహేష్ హెల్త్ రంగంలో పెట్టుబడులు పెట్టడం గమనార్హం. మరి ఈ ఫిట్ డే బిజినెస్ ఎలా పెరుగుతుందో చూడాలి.
Fit Day Mahesh