Site icon HashtagU Telugu

Mahesh Babu: సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసిన మహేష్ బాబు.. అలా ఎలా చేస్తారంటూ?

Mixcollage 28 Feb 2024 01 24 Pm 5142

Mixcollage 28 Feb 2024 01 24 Pm 5142

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనందరికీ తెలిసిందే. మహేష్ బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలను నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. ఆఫ్రికన్ అడువుల నేపథ్యంలో అడ్వైంచర్ డ్రామాగా ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్నారు జక్కన్న.

ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా మరికొన్ని రోజుల్లోనే రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇటీవలే జర్మనీలో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్ స్టాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఒక వెబ్ సిరీస్ చూశాక తన మైండ్‏లో మెదిలిన ప్రశ్నలను.. ఆలోచనలను అభిమానులతో పంచుకున్నారు. ఇంతకీ మహేష్‍ను అంతగా కలవరపరిచిన ఆ సిరీస్ ఏంటో తెలుసుకుందామా.. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నిర్మాతగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ భామ పోచర్ అనే మలయాళ వెబ్ సిరీస్ ను నిర్మించింది. ఇందులో నిమిషా సజయన్, రోషన్ మాథ్యూ, దిబ్యేందు భట్టాచార్య, కని కృతి, అంకిత్ మాధవ్ కీలకపాత్రలు పోషించారు. ఫిబ్రవరి 23 నుంచి ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

అయితే ఇప్పటికే ఈ సిరీస్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కేరళ అడవుల్లో ఏనుగల వేట రాకెట్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఢిల్లీ క్రైమ్ ఫేమ్ రిచీ మోహతా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ కు సక్సెస్ ఫుల్ గా స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా ఈ సిరీస్ చూసిన మహేష్ ప్రశంసలు కురిపించారు. ఈ సిరీస్ చూసిన వెంటనే తన మదిలో కొన్ని మెదిలాయంటూ చెప్పుకొచ్చారు. అసలు ఎవరైనా దీన్ని ఎలా చేయగలరు.. వారికి చేతులు వణకలేదా ? పోచర్ అనే క్రైమ్ వెబ్ సిరీస్ చూసిన తర్వాత ఇలాంటి ప్రశ్నలు నా మదిలో మెదులుతూనే ఉన్నాయి. ఏనుగులను రక్షించాల్సిన బాధ్యత మన అందరి పైనా ఉంది అంటూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు మహేష్. ప్రస్తుతం సూపర్ స్టార్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవ్వడంతో ఆ పోస్ట్ పై నేటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

Exit mobile version