Guntur Karam RRR Record Break సూపర్ స్టార్ మహేష్ స్టామినా తెలిసేలా తెలుగు రెండు రాష్ట్రాల్లో గుంటూరు కారం ఫీవర్ కనిపిస్తుంది. సంక్రాంతికి మహేష్ సినిమా వస్తే ఎలా ఉంటుందో ఆ వైబ్ కి ఏమాత్రం తగ్గకుండా అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా అన్ని చోట్లా కూడా గుంటూరు కారం హంగామా కనిపిస్తుంది. సిటా, విలేజ్ అనే తేడా లేకుండానే గుంటూరు కారం హడావుడి కనిపిస్తుంది. ఇక ఈ జోష్ కి తగినట్టుగా మల్టీ ప్లెక్స్ లో అన్ని షోలు గుంటూరు కారం సినిమానే వేస్తూ రచ్చ చేస్తున్నారు.
We’re now on WhatsApp : Click to Join
హైదరబాద్ సిటీ మల్టీ ప్లెక్స్ లో గుంటూరు కారం హంగామా కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రసాద్ ఐమాక్స్ లో అన్ని స్క్రీన్స్ లో ఏకంగా 41 షోలు వేస్తున్నారట. గురువారం మిడ్ నైట్ నుంచే గుంటూరు కారం స్క్రీనింగ్ అవుతుందని తెలుస్తుంది. రోజులో 41 షోలు అవన్నీ దాదాపు హౌస్ ఫుల్సే అవుతున్నాయి. ఈ లెక్కన RRR రికార్డుని సైతం మహేష్ గుంటూరు కారం బ్రేక్ చేస్తుందని తెలుస్తుంది.
ఒక్కరోజులో 41 షోలు అంటే ఇది కదా మహేష్ స్టామినా అని ప్రతి సూపర్ స్టార్ అభిమాని కాలర్ ఎగురవేస్తున్నాడు. ఇద్దరు హీరోలు నటించిన ఆర్.ఆర్.ఆర్ సినిమాకు కూడా ఇన్ని షోస్ పడలేదు కానీ సూపర్ స్టార్ మహేష్ బాబుకి రికార్డ్ షోస్ పడటం చూస్తేనే సూపర్ స్టార్ మాస్ స్టామినా ఏంటన్నది అర్ధమవుతుంది.
మహేష్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ బజ్ అదిరిపోయింది. మహేష్ ఊర మాస్ అవతారం ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేస్తుందని అంటున్నారు. సినిమాలో శ్రీ లీల డ్యాన్స్, ఆమె క్యూట్ పర్ఫార్మెన్స్ తో పాటు థమన్ మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తుంది. రిలీజైన నాలుగు సాంగ్స్ అదిరిపోగా కుర్చీ మడతపెట్టి సాంగ్ థియేటర్ లో బ్లాస్ట్ అవ్వడం ఖాయమని అంటున్నారు.
మహేష్ త్రివిక్రం ఇద్దరు కలిసి అతడు, ఖలేజా సినిమాలు చేశారు. ఆ తర్వాత 12 ఏళ్ల గ్యాప్ తో గుంటూరు కారం సినిమా చేశారు. ఈ సినిమాను హాసిని హారిక క్రియేషన్స్ బ్యానర్ లో రాధాకృష్ణ నిర్మించారు. సినిమా మహేష్ స్టామినాకు తగినట్టుగానే బిజినెస్ చేసింది. సంక్రాంతికి మొనగాడుగా మహేష్ నిలబడేందుకు మరోసారి గుంటూరు కారం హడావుడి చేస్తుంది. మరికొద్ది గంటల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రచ్చ చేస్తుందో చూడాలి.