Site icon HashtagU Telugu

Guntur Karam Digital Release Date : నెలలోపే గుంటూరు కారం కూడా.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్..!

Is Mahesh Babu Tag Change From Super Star to Gold Star

Is Mahesh Babu Tag Change From Super Star to Gold Star

Guntur Karam Digital Release Date సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం సినిమా సంక్రాంతికి రిలీజై సూపర్ హిట్ అయ్యింది. త్రివిక్రం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా హారిక హాసిని బ్యానర్ లో చినబాబు నిర్మించారు. సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా థమన్ మ్యూజిక్ అందించారు. బాక్సాఫీస్ దగ్గర మహేష్ బాబు మాస్ స్టామినా చూపిస్తూ గుంటూరు కారం వసూళ్లు ప్రభంజనం సృష్టించాయి.

థియేట్రికల్ రన్ దాదాపు పూర్తైన గుంటూరు కారం సినిమా ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కు సిద్ధమైంది. గుంటూరు కారం డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సొంత చేసుకుంది. గుంటూరు కారం డిజిటల్ రిలీజ్ ను ఫిబ్రవరి 9న రిలీజ్ లాక్ చేశారు. జనవరి 12 సంక్రాంతి సందర్భంగా రిలీజైన గుంటూరు కారం నెల లోపే ఓటీటీ రిలీజ్ అవుతుంది.

ఫిబ్రవరి లో థియేట్రికల్ రిలీజ్ లతో పాటుగా క్రేజీ సినిమాలు ఓటీటీ రిలీజ్ లు అవుతున్నాయి. మహేష్ త్రివిక్రం ఈ కాంబోలో వచ్చిన గుంటూరు కారం డిజిటల్ రిలీజ్ లో ఎలాంటి హంగామా సృష్టిస్తుందో చూడాలి. మహేష్ బాబు ఈ సినిమాలో వేసిన డ్యాన్స్ ల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకున్నారు.

సో ఐదు రోజుల్లో గుంటూరు కారం సినిమా ఓటీటీ రిలీజ్ అవుతుంది. మరి డిజిటల్ రిలీజ్ లో గుంటూరు కారం ఏ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.