Site icon HashtagU Telugu

Guntur Kaaram: ‘గుంటూరు కారం’ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్, బాక్సులు బద్దలైపోవాల్సిందే

Mahesh Guntur Kaaram

Mahesh Guntur Kaaram

Guntur Kaaram: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జనవరి 12, 2024న విడుదల కానుంది. మొదటి సింగిల్ ‘దమ్ మసాలా’ విడుదలతో సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా ప్రారంభమయ్యాయి. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి టించారు. ఈ చిత్రానికి సంగీతం ఎస్ థమన్ స్వరాలు సమకుర్చారు. దర్శకుడు ఎస్ఎస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ తొలిపాటను విడుదల చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు. తమన్ సంగీతం అందించగా.. రిరామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. సంజిత్ హేగ్డ్ ఆలపించారు. ఈ సాంగ్ ఇప్పుడు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. థియేటర్స్ లో దుమ్మురేగడం ఖాయం అంటున్నారు అభిమానులు.

హరిరామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. సంజిత్ హేగ్డ్ ఆలపించారు. ఈ సాంగ్ ఇప్పుడు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. థియేటర్స్ లో దుమ్మురేగడం ఖాయం అంటున్నారు అభిమానులు. ఈపాటను గమనిస్తే త్రివిక్రమ్ మహేశ్ మూవీ కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నాడని తెలుస్తోంది.

మహేష్ బాబు అతనికి రాబోయే సంవత్సరం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. చివరిగా మహేశ్ ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటించారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ మసాలా ప్రాజెక్ట్  గుంటూరు కారం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక రాజమౌళితో మహేష్ బాబు తదుపరి చిత్రం కూడా  ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: BRS Minister: పాలకుర్తిలో జోరుగా ఎర్రబెల్లి ప్రచారం, పలువురు బీఆర్ఎస్ లో చేరిక