త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా శ్రీలీల(Sreeleela), మీనాక్షి చౌదరి(Meenakshi Choudhary) హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం(Guntur Kaaram). అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే అనేక వాయిదాలు పడుతుంది. అలాగే సినిమా నుంచి హీరోయిన్, ఫైట్ మాస్టర్స్.. ఇలా చాలా మంది తప్పుకున్నారు. మహేష్ ఏమో షూట్ చేయకుండా వరుసగా ఫారిన్ ట్రిప్స్ వేస్తున్నారు.
దీంతో సంక్రాంతికి అనౌన్స్ చేసిన గుంటూరు కారం సినిమా రిలీజ్ అయ్యేలా లేదు అని అభిమానులు నిరాశ చెందుతున్నారు. అయితే తాజాగా మహేష్ బాబు గుంటూరు కారం సినిమా గురించి మాట్లాడాడు. మహేష్ బాబు బిగ్ సి కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా బిగ్ సి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసినందుకు ఓ ప్రెస్ మీట్ ని నిర్వహించగా మహేష్ బాబు గెస్ట్ గా వచ్చారు.
ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు గుంటూరు కారం సినిమా లేట్ అవుతుంది, అసలు రిలీజ్ అవుతుందా అని అడగగా డౌట్ అక్కర్లేదు, సంక్రాంతికి సినిమా వస్తుంది అని చెప్పాడు మహేష్ బాబు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంక్రాంతికి మహేష్ గుంటూరు కారంతో రావడం ఖాయం అని ఫిక్స్ అయ్యారు. ఇక ఈ సినిమా జనవరి 12న రిలీజ్ చేస్తారని చిత్రయూనిట్ ప్రకటించింది.
Also Read : Pawan Kalyan OG: భారీ ట్విస్ట్ ఇచ్చిన సుజీత్.. రెండు భాగాలుగా పవన్ కళ్యాణ్ ఓజీ..?!