Site icon HashtagU Telugu

MB Foundation : పిల్లల గుండె ఆరోగ్యంపై మహేష్ బాబు ఫౌండేషన్ మరో మంచి పని..

Mb Foundation done a Heartathon Event

Mb Foundation done a Heartathon Event

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఎంతోమంది పేద పిల్లలకు తన సొంత డబ్బుతో గుండె(Heart) వైద్యం చేయించి బతికిస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే దాదాపు 1000 మందికి పైగా చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్స్ చేయించారు మహేష్. ఇక తన MB ఫౌండేషన్ ద్వారా ఈ ఆపరేషన్స్ మాత్రమే కాక ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహేష్ కుటుంబం మొత్తం ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు

తాజాగా MB ఫౌండేషన్ చేసే ఈ మంచి పనిలో ఔట్‌రీచ్ క్లబ్ ఆఫ్ మహీంద్రా యూనివర్శిటీ కూడా తోడయింది. ఇటీవల ఈ రెండు సంస్థలు కలిసి.. గుండె జబ్బులతో పోరాడుతున్న పిల్లలకు సహాయం కోసం ఒక కార్యక్రమం నిర్వహించాయి. పిల్లల గుండె ఆరోగ్యంపై అవగాహన తీసుకురావడానికి, ఈ మంచి పనికి నిధులను సేకరించడానికి సుమారు 300 మంది వ్యక్తులతో ‘హార్ట్‌థాన్’ అనే ఒక రన్ ఈవెంట్ ని నిర్వహించారు. మార్చి 16న హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.

ఇందులో పాల్గొన్న 300 మంది వ్యక్తులు 3కి.మీ నుంచి 5కి.మీ మార్గంలో రన్ చేసి మహేష్ బాబు ఫౌండేషన్, ఔట్‌రీచ్ క్లబ్ కార్యక్రమాలకి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేష్ భార్య నమ్రత శిరోద్కర్(Namrata Shirodkar) కూడా పాల్గొని రన్నింగ్ లో విజేతలుగా నిలిచిన వారికి బహుమానాలు అందచేశారు. తమ MB ఫౌండేషన్ కి మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

 

Also Read : Ram Charan: కూతురు, భార్యతో ఎంజాయ్ చేస్తూ బీచ్ లో చిల్ అవుతున్న చెర్రీ. వీడియో వైరల్?