Krishna : ‘సాయిబాబా’గా కృష్ణ ఓ మూవీ చేసారా..? మహేష్ చేతుల మీదుగా ఓపెనింగ్..

'సాయిబాబా'గా కృష్ణ ఓ మూవీ చేసారని మీకు తెలుసు. ఆ మూవీ మహేష్ బాబు చేతుల మీదుగా లాంచ్ అయ్యింది.

  • Written By:
  • Publish Date - May 20, 2024 / 12:56 PM IST

Krishna : సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో డేరింగ్ నిర్ణయాలు తీసుకోని.. తెలుగు ఇండస్ట్రీకి ఎన్నో కొత్త విషయాలను పరిచయం చేసారు. అంతేకాదు పాత్రల ఎంపికల విషయంలో కూడా డేరింగా వ్యవహరించేవారు. అల్లూరి సీతారామరాజు, గూఢచారి వంటి పలు పాత్రలతో సినిమా చేయడం రిస్క్ అని ఎంతమంది చెప్పినా.. వినకుండా ఆ పాత్రలతో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్స్ అందుకున్న హిస్టరీ కృష్ణ సొంతం. కాగా సూపర్ స్టార్ కృష్ణ.. ‘సాయిబాబా’గా కూడా నటించారంట. సినిమా షూటింగ్ కూడా జరుపుకుంది. కానీ ఆడియన్స్ ముందుకు రాలేదు.

ఇప్పుడు మహేష్ బాబుకి ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారో.. కృష్ణకి కూడా అదే రేంజ్‌లో, కాదు కాదు అంతకుమించే అభిమానులు ఉండేవారు. ఆయనపై ఎంతో అభిమానం చూపించేవారు. తన పై అంతటి అభిమానం చూపిస్తున్న ఫ్యాన్స్ పై కృష్ణ కూడా అదే ప్రేమని చూపించేవారు. ఇక ఆ అభిమానుల్లో ఒకరు దర్శకుడు బాబ్జి. కృష్ణ పై అభిమానంతో ఒక కథని రాసుకొచ్చి కృష్ణని ఒప్పించారు. ఇక ఆ సినిమాకి ‘సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అస్సోసియేషన్’ అనే క్రేజీ టైటిల్ ని పెట్టారు.

ఇక ఈ చిత్రాన్ని 2001 డిసెంబర్ 16న చాలా గ్రాండ్ గా లాంచ్ చేసారు. ముందే రోజే ఈ మూవీ ఓపెనింగ్ గురించి ప్రకటన ఇచ్చి, ఫ్యాన్స్ ని ఆహ్వానించారు. దీంతో ఆ ఈవెంట్ కి చాలామంది ఫ్యాన్స్ హాజరయ్యారు. అభిమానులతో పాటు ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, మహేష్ బాబు కూడా ఆ ఈవెంట్ కి హాజరయ్యారు. ఆ సమయంలో మహేష్ బాబుకి విపరీతమైన జ్వరం ఉన్నాసరే.. తండ్రి కోసం ఈవెంట్ కి హాజరయ్యారు.

కాగా ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ.. అభిమానులకు సందేశాలు ఇచ్చే అంశాలతో పాటు, సామజిక అంశాలను కూడా దర్శకుడు రాసుకున్నారు. ఈక్రమంలోనే కృష్ణని ‘భగత్ సింగ్’గా, ‘సాయిబాబా’గా.. ఇలా పలు పాత్రల్లో చూపించాలని దర్శకుడు అనుకున్నారు. సాయిబాబాగా కృష్ణతో కొన్ని సీన్స్ ని కూడా షూట్ చేసారు. కృష్ణ సాయిబాబాగా నటిస్తున్నారని తెలిసి.. అప్పటిలో ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు సెట్స్ వచ్చి మరి చిత్రీకరణ చూశారట. అయితే ఈ సినిమా కొన్ని అనివార్య కారణాలు వల్ల షూటింగ్ మధ్యలోనే ఆపేసుకుంది. దీంతో సినిమా ఆడియన్స్ ముందుకు రాలేకపోయింది.