Site icon HashtagU Telugu

Mahesh Babu: నాన్న ఎల్లప్పుడూ నా గుండెల్లో ఉంటారు, మన మధ్యే ఉంటారు!

Mahesh

Mahesh

సూపర్‌స్టార్‌ కృష్ణ పెద్దకర్మను ఆదివారం కుటుంబ సభ్యులు నిర్వహించారు. పెద్దకర్మకు భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్‌ బాబు మాట్లాడుతూ..‘నాన్న గారు నాకు చాలా ఇచ్చారు. నాన్న గారు ఇచ్చిన దాంట్లో అన్నిటికంటే గొప్పది మీ అభిమానం. ఆయనకి ఎప్పుడూ రుణపడి వుంటాను.

నాన్న గారు ఎల్లప్పుడూ నా గుండెల్లో వుంటారు. మీ గుండెల్లో వుంటారు. మన మధ్యే ఉంటారు. మీరందరూ ఇక్కడకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ అభిమానం, ఆశీస్సులు నాపై ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు. కాగా కృష్ణ పెద్దకర్మ కు అభిమానులకు మహేశ్ బాబు గ్రాండ్ గా విందు భోజనం ఆఫర్ చేశారు. దాదాపు 32 రకాల వంటకాలను అభిమాలకు వడ్డించినట్టు సమాచారం.