Site icon HashtagU Telugu

Mahesh Babu:మరో జన్మంటూ ఉంటే.. నువ్వే నాకు అన్నయ్య!

mahesh babu ramesh abbu

mahesh babu ramesh abbu

జూబ్లీ హిల్స్ లోని మహాప్రస్థానంలో మహేశ్ బాబు సోదరుడు రమేష్ బాబు అంత్యక్రియలు పూర్తయ్యాయి. రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ తండ్రి చితికి నిప్పంటించారు. కోవిడ్ వ్యాప్తి కారణంగా కొద్దిమంది మాత్రమే అంత్యక్రియలకు హాజరయ్యారు. ఘట్టమనేని కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు అంత్యక్రియల్లో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. కాగా కరోనా సోకి క్వారంటైన్‌లో ఉన్న మహేష్ బాబు.. తన సోదరుడిని కడసారి చూపుకు కూడా నోచుకోలేకపోయారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు ఓ ఎమోషన్ పోస్టు షేర్ చేశారు.

‘‘మీరు నాకు స్ఫూర్తి, నా బలం, నా ధైర్యం, నా సర్వస్వం. నువ్వు లేకుంటే ఈ రోజు ఉన్న మనిషిలో సగం కూడా ఉండేవాడిని కాదు. మీరు నాకోసం ఎంతో చేశారు. నాకు మరో జన్మంటూ ఉంటే నువ్వే నా అన్నయ్య. ఇప్పటికీ, ఎప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’’ అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మహేశ్ బాబు హోం క్వారంటైన్ అయిన సంగతి తెలిసిందే.