Site icon HashtagU Telugu

1-Nenokkadine : ‘1 నేనొక్కడినే’ సినిమా కోసం మహేష్ చేసిన రియల్ సాహసం..

Mahesh Babu done real stunts in 1-Nenokkadine Movie

Mahesh Babu done real stunts in 1-Nenokkadine Movie

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar), సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్ లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘1:నేనొక్కడినే’. టైటిల్ తోనే ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ చేసుకున్న ఈ మూవీ 2014లో రిలీజ్ అయ్యింది. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. టైటిల్ లో కనిపించిన హీరోయిజం సినిమాలో కనిపించలేదు. మాస్ ఇమేజ్ ఉన్న మహేష్ ని ఒక మానసిక సమస్యతో బాధ పడుతున్న వ్యక్తిగా చూపించడంతో ప్రతి ఒక్కరిని నిరాశ పరిచింది.

అయితే హాలీవుడ్ స్థాయిలో ఉన్న సుకుమార్‌ టేకింగ్‌ కి మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు రియల్ స్టంట్స్ చేశాడు. సినిమా మొదటి భాగంలో నడి సముద్రంలో పడవ ఛేజింగ్ సీన్ ఉంటుంది. ఆ సీన్ లో మహేష్, విలన్ గ్యాంగ్ నుంచి తప్పించుకుంటూ ఫైట్ చేస్తూ వెళ్తుంటాడు. ఆ యాక్షన్ సీక్వెన్స్ ఆడియన్స్ కి బాగా థ్రిల్ ని కలుగజేసింది. ఆ సీన్ ని రియల్ గా సముద్రంలో, మహేష్ స్వయంగా చేశాడు. అలాగే ఆ సీన్ లో నటిస్తున్న ఆర్టిస్టులంతా ప్రొఫెషనల్‌ స్విమ్మర్స్‌. కానీ మహేష్ బాబుకి మాత్రం ఆ సమయంలో ఈత సరిగా రాదట, అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాడట.

అంతేకాదు బోటు డ్రైవింగ్ కూడా పూర్తిగా రాదట మహేష్‌కి. దీంతో సుకుమార్ కొంత భయపడ్డాడట. ఇక సీన్ లోకి వెళ్లిన తరువాత మహేష్ బాబు బోటు డ్రైవింగ్ చూసి సుకుమార్ కి కళ్ళు చెదిరాయి. ఒక ప్రొఫెషనల్‌ బోటు డ్రైవర్‌ ఎలా నడుపుతాడో అంత వేగంగా మహేష్ బోటు డ్రైవ్ చేసి అందర్నీ షాక్ కి గురి చేశాడు. ఆ సీన్ చేస్తున్నప్పుడు.. నటీనటులు, టెక్నీషియన్స్, ప్రతి ఒక్కరికి లైఫ్ జాకెట్లు వేసుకొనే చేశారు. కానీ ఒక్క మహేష్ బాబు తప్ప. ఈత సరిగ్గా రాకుండా, బోటు డ్రైవింగ్ సరిగ్గా తెలియకుండా, లైఫ్ జాకెట్ లేకుండా మహేష్ ఆ సీన్ కోసం పెద్ద సాహసం చేశాడని సుకుమార్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.

 

Also Read : Venkatesh : ‘రానా నాయుడు’ మళ్ళీ వస్తుంది.. కానీ ఈ సారి బోల్డ్ కంటెంట్..

Exit mobile version