Mahesh Babu : ఇంగ్లీష్ లెటర్స్‌లో.. ఆల్మోస్ట్ అన్ని అక్షరాలపై యాడ్స్ చేసేసిన మహేష్.. రికార్డ్ సెట్..

మహేష్ బాబు ఆల్మోస్ట్ ఇంగ్లీష్ లెటర్స్ లో ఉన్న ప్రతి అక్షరం పై ఒక యాడ్ చేసేశారు. మరి ఆ యాడ్స్ ఏంటి అనేవి ఓ లుక్ వేసేయండి మీరుకూడా..

Published By: HashtagU Telugu Desk
Mahesh Babu done Ads in almost letters in English Alphabets

Mahesh Babu done Ads in almost letters in English Alphabets

టాలీవుడ్(Tollywood) లో ఎక్కువుగా కమర్షియల్ యాడ్స్ చేసే హీరో ఎవరంటే.. మహేష్ బాబు(Mahesh Babu) అని టక్కున చెప్పేస్తారు అందరూ. నిజానికి మహేష్ బాబు సినిమాలు కంటే ప్రమోషనల్ యాడ్స్ తోనే ఆడియన్స్ ని ఎక్కువ పలకరిస్తూ ఉంటారు. ఆ యాడ్స్ కి వచ్చిన రెమ్యునరేషన్స్ ని మహేష్ తన MB ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలకు, పిల్లలకు ఉచిత హార్ట్ ఆపరేషన్స్ కి వినియోగిస్తాడని తెలిసిందే.

అయితే మహేష్ బాబు ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఇంగ్లీష్ లెటర్స్ లో ఉన్న ప్రతి అక్షరం పై ఒక యాడ్ చేసేశారు. మరి ఆ యాడ్స్ ఏంటి అనేవి ఓ లుక్ వేసేయండి మీరుకూడా..

A ఫర్ అభి బస్సు నుంచి మొదలుపెట్టి Y ఫర్ ‘యప్ టీవీ’ వరకు అనేక బ్రాండ్స్ కి అంబాసడర్ గా పని చేసారు. ఇంగ్లీష్ లో మొత్తం 26 లెటర్స్ ఉంటే వీటిలో K, Q, X, Z ఆల్ఫాబెట్స్ ని మాత్రమే మహేష్ వదిలేశారు.

A – ABHI BUS N – NAVRATNA TALC
B – BIG C O – OTTO
C – CLOSE UP P – PAN BAHAR
D – DENVER Q – No AD
E – EVEREST R – RAINBOW HOSPITAL
F – FLIPKART S – SANTOOR
G – GOLD WINNER T – TECHNO PAINTS
H – HUMBL U – UNIVERCELL
I – IDEA V – VIVEL
J – JOS ALUKKAS W – WHITEHAT JR
K – No AD X – No AD
L – LLOYD Y – YUPP TV
M – MOUNTAIN DEW Z – No AD

ఇక వీటిల్లో ఒక్కో లెటర్ కి ఒకటి కంటే ఇంకా ఎక్కువే యాడ్స్ చేశారు. రానున్న రోజుల్లో మహేష్ బాబు ఆ మిగిలిన లెటర్స్ పై కూడా యాడ్స్ చేసేస్తారేమో చూడాలి. ఇలా యాడ్స్ తో కూడా మహేష్ సరికొత్త రికార్డ్ సెట్ చేశాడు.

  Last Updated: 13 Jan 2024, 06:18 AM IST