Site icon HashtagU Telugu

Mahesh Dance: మహేశ్ మాస్ డాన్స్.. వీడియో వైరల్

Mahesh

Mahesh

మహేశ్‌ హీరోగా దర్శకుడు పరశురామ్‌ తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’ సినిమా సక్సెస్‌ మీట్‌ను కర్నూలు ‘యస్‌.టి.బి.టి’ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో సోమవారం నిర్వహించారు. అన్నివర్గాల ప్రేక్షకులు అలరించి ప్రపంచవ్యాప్తంగా నాగులు రోజుల్లో 153+ కోట్లు వసూళు చేసి బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ నేపధ్యంలో సర్కారు వారి పాట మాస్ సక్సెస్ సెలబ్రేషన్స్ ని కర్నూల్ లో ఘనంగా నిర్వహించారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ సహా చిత్ర యూనిట్ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకలో ఒక మాస్ మూమెంట్ చోటు చేసుకుంది. ఈ చిత్రంలోని ‘మ మ మహేశ’ పాటకు డ్యాన్సర్లు పెర్ఫామ్‌ చేస్తుండగా సంగీత దర్శకుడు తమన్‌ వెళ్లి కాలు కదిపారు. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు స్టేజ్ పైకి వచ్చి డ్యాన్స్ చేయడం అభిమానులని అలరించింది. మ మ మహేషా పాటకు డాన్స్ చేయడంతో ఆ వీడియో వైరల్ గా మారింది. అయితే ఎవరి ప్రమేయం లేకుండానే మహేశ్ స్టేజీ పైకి వచ్చి డాన్స్ చేయడం అందరిని ఆశ్చర్యపర్చింది.

 

 

 

Exit mobile version