Site icon HashtagU Telugu

Mahesh Babu: యూట్యూబ్ రికార్డులను బద్దలు కొట్టిన మహేశ్, శ్రీమంతుడు మూవీకి 200 M+ వ్యూస్

Mahesh

Mahesh

Mahesh Babu: కొన్ని సినిమాలు అంతే ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంటుంది. అతడు, నువ్వు నాకు నచ్చావ్, ఒక్కడు లాంటి సినిమాలను ఇప్పటికీ టీవీల్లోనే చూస్తుంటాం. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ శ్రీమంతుడు 8 సంవత్సరాల క్రితం 2015లో విడుదలై భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై కొరటాల శివ దర్శకత్వం వహించిన శ్రీమంతుడు బాక్సాఫీస్ వద్ద నాన్-బాహుబలి హిట్‌గా నిలిచింది.

శ్రీమంతుడు ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించాడు. యూట్యూబ్‌లో 200 M+ వీక్షణలు సాధించిన తొలి తెలుగు పూర్తి సినిమాగా నిలిచింది. శ్రీమంతుడు కూడా ఒక తెలుగు చిత్రానికి అత్యధిక వీక్షణలను పొందింది. యూట్యూబ్‌లో కూడా అత్యధికంగా ఇష్టపడిన తెలుగు చిత్రం ఇదే. గ్రామాన్ని దత్తత తీసుకొని డెవలప్ చేయాలనే కథతో శ్రీమంతుడు సినిమా రూపుదిద్దుకుంది. తన తండ్రి జన్మస్థలమైన గ్రామాన్ని దత్తత తీసుకున్న ఆదర్శవంతమైన యువకుడి కథను చెబుతుంది. ఈ సినిమా మనకు గ్రామాల ప్రాముఖ్యతను, మానవీయ విలువలను నేర్పుతుంది.

మైత్రీ మూవీ మేకర్స్‌కు తొలి నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయిక. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న మంచి సినిమాలతో టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థగా ఉన్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి అనేక అవార్డులు వచ్చాయి.

Also Read: Hyderabad: దాగుడుమూతలు ఆడుతూ టెర్రస్ పై నుంచి పడి బాలుడి మృతి