Site icon HashtagU Telugu

Mahesh Babu: పవన్ ‘భీమ్లా నాయక్’ పై ‘మహేష్’ కామెంట్స్ వైరల్

Pawan Kalyan Mahesh Babu

Pawan Kalyan Mahesh Babu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత “గబ్బర్ సింగ్” తరహాలో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో….’ భీమ్లా నాయక్’ చిత్ర బృందానికి పలువురు హీరోలతో పాటు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ‘భీమ్లా నాయక్’ ఘన విజయం సాధించడం పట్ల చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురిపించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారని ఆకాశానికెత్తారు. డానియల్ శేఖర్ గా రానా… అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్ తో… అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశారని కితాబిచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆయన ట్వీట్ చేశారు.

మహేష్ ట్వీట్ ఏంటో చూద్దాం:

”భీమ్లా నాయక్ క్యారెక్టర్ లో ఫుల్ ఫైర్ తో నిప్పులు చెరిగే తీవ్రతతో, ఎగిసే జ్వాలలా పవన్ కళ్యాణ్ కనిపిస్తే… డేనియల్ శేఖర్‌‌గా రానా సెన్సేషనల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తెరపై వీరిద్దరూ అద్భుతంగా నటించారు. ఎప్పట్లాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ తన పెన్ పవర్ ద్వారా రాసిన డైలాగులు అద్భుతంగా పేలాయి. ఇటీవల కాలంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ‘భీమ్లా నాయక్’ సినిమానే అత్యుత్తమం అని చెప్పాలి. నాకు నచ్చిన సినిమాటోగ్రాఫర్లలో ఒకడైన రవి కే చంద్రన్ అద్భుతమైన విజువల్స్ తో కట్టిపడేశారు. తమన్ సంగీతం మనల్ని వెన్నాడుతుంది, మంత్రముగ్ధుల్ని చేస్తుంది.. యావత్ చిత్రబృందానికి అభినందనలు” అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. దీంతో ప్రస్తుతం మహేష్ బాబు ‘భీమ్లా నాయక్’ పై చేసిన కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.