Site icon HashtagU Telugu

Mahesh Babu Birthday Special: రాజమౌళి ఇచ్చిన స్పెషల్ అప్డేట్, పోస్టర్ అదిరిపోయింది!

Mahesh Babu And Rajamouli

Mahesh Babu And Rajamouli

హైదరాబాద్, ఆగస్టు 9: Mahesh Babu Birthday Special:సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా, ఆయన అభిమానులకు డైరెక్టర్ రాజమౌళి అత్యంత స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. మహేష్ బాబు గతంలో “గుంటూరు కారం” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించగా, ఇప్పుడు ఆయన రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది.

ఈ సందర్భంగా, రాజమౌళి తన సోషల్ మీడియా ద్వారా మహేష్ బాబును ఒక కొత్త లుక్‌లో చూపిస్తూ, ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ నవంబర్ 2025లో విడుదల అవుతుందని ప్రకటించారు.

పోస్టర్ వివరాలు:

జక్కన్న షేర్ చేసిన పోస్టర్‌లో, మహేష్ బాబు మెడలో త్రిశూలం ఉన్న లాకెట్ ధరించి కనిపిస్తున్నారు. ఈ లాకెట్‌తో పాటు, అతని మెడ నుంచి రక్తం కారుతూ ఉన్నట్లు పోస్టర్‌లో చూపించారు. పోస్టర్ చూసిన అభిమానులు ఎంతో ఆనందంగా స్పందిస్తున్నారు. ఎప్పటిలాగే ఈ పోస్టర్ నెక్ట్స్ స్టెప్ కోసం ఆసక్తి చూపిస్తున్నట్లు వారు కామెంట్ చేస్తున్నారు.

రాజమౌళి చెప్పిన మాటలు:

రాజమౌళి అభిమానులకు ఓ స్పెషల్ సందేశం కూడా ఇచ్చారు. “మేము కొద్దిరోజుల క్రితం షూటింగ్ ప్రారంభించాం. సినిమా గురించి తెలుసుకోవాలని మీరు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని నేను అర్థం చేసుకోగలను. సినిమా స్టోరీ చాలా పెద్దది, అందుకు సంబంధించిన ఫోటోలు, ప్రెస్ కాన్ఫరెన్సులు ఇంకా లేవు, ఎందుకంటే వాటికి న్యాయం చేయలేమని భావిస్తున్నాను. ప్రస్తుతం, ఈ సినిమాను అద్భుతంగా చూపించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఫస్ట్ రివీల్ కూడా అద్భుతంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. నవంబర్ 2025 వరకు మీరు ఆగక తప్పదు. మీరు ఎప్పటికీ చూడనటువంటి సినిమాను మీకు చూపించేందుకు మా ప్రయత్నం కొనసాగుతుంది. కాబట్టి కాస్త ఓపిక పట్టండి!” అని రాజమౌళి తెలిపారు.