Site icon HashtagU Telugu

Mahesh Babu: రణ్‌బీర్ కపూర్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని.. యానిమల్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మహేశ్ బాబు

Whatsapp Image 2023 11 27 At 11.17.56 Pm (1)

Whatsapp Image 2023 11 27 At 11.17.56 Pm (1)

Mahesh Babu : బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌కి తాను పెద్ద ఫ్యాన్ అని సూపర్ స్టార్ మహేశ్ బాబు అన్నారు. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన యానిమల్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన మహేశ్ బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 1న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఈ వేడుకకు మహేశ్ బాబుతో పాటు దర్శకధీరుడు రాజమౌళి కూడా హాజరయ్యారు. ఈసందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్ తాను కూడా చూశానని.. అదిరిపోయిందన్నారు. సందీప్ వంగా ఫోన్ చేసి యానిమల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావాలని పిలిచారు. దీంతో రావాలనిపించింది. సందీప్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో అందరి నటన బాగుంది. ముఖ్యంగా అనిల్ కపూర్, బాబీ డియోల్ నటన నన్ను అట్రాక్ట్ చేశాయి. రష్మిక మందన్నా నటిగా చాలా ముందుకు వెళ్లిపోయింది.

ఆమె సినిమా జర్నీ అందరికీ ఇన్సిపిరేషన్. రణ్ బీర్ కు నేను పెద్ద ఫ్యాన్ ని. ఈ విషయం ఇప్పుడు కాదు.. నేను చాలా సార్లు చెప్పా. కానీ.. రణ్ బీర్ మాత్రం లైట్ తీసుకున్నడు. కాబట్టి ఇప్పుడు మరోసారి ఈ వేదిక మీద చెబుతున్నా. ఇండియాలోనే ది బెస్ట్ యాక్టర్ రణ్ బీర్.. అంటూ మహేశ్ బాబు చెప్పుకొచ్చారు.

https://twitter.com/CharanSmoki/status/1729177397596164604

Exit mobile version