Site icon HashtagU Telugu

Mahesh & Vijay fans War: మహేశ్, విజయ్ అభిమానుల ‘ట్విట్టర్’ వార్

Mahesh And Vijay

Mahesh And Vijay

మహేష్ బాబు బ్లాక్ బస్టర్స్ ఒక్కడు, పోకిరి సినిమాలు తమిళంలో గిల్లి, పోక్కిరి పేరుతో రీమేక్ అయ్యాయి. ఈ రెండు సినిమాల్లో దళపతి విజయ్ హీరోగా నటించాడు. ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాయి. ఇటీవల విజయ్ అభిమానులు ఈ రీమేక్‌లు మహేష్ బాబు ఒరిజినల్ చిత్రాల కంటే బాగున్నాయి అని పేర్కొన్నారు. దీంతో మహేశ్, విజయ్ అభిమానుల మధ్య ట్విట్టర్ వార్ మొదలైంది. ఇద్దరి అభిమానులు ఘోరంగా ట్రోలింగ్ కు దిగారు. #BoycottGayMahesh, #NationalTrollMaterialVijay వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో రెచ్చిపోయారు ఫ్యాన్స్. ఈ మాటల యుద్ధం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

ప్రస్తుతం మహేష్ బాబు SSMB28 కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి పనిచేస్తున్నారు. వీరి కాంబంలో గతంలో 2010 చిత్రం ఖలేజా, 2007 అతడు సినిమాలు వచ్చాయి. దీనితో పాటు, ఎస్ఎస్ రాజమౌళి సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు మహేశ్. మరోవైపు దళపతి విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వరిసు చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం 2023 లో సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.