Site icon HashtagU Telugu

Pic Talk: బిల్ గేట్స్ తో మహేష్ బాబు.. సింప్లిసిటీకి ఫిదా!

Mahesh

Mahesh

మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ ప్రస్తుతం న్యూయార్క్‌లో విహారయాత్రలో ఉన్నారు. ‘సర్కారువారి పాట’తో సందడి చేసిన మహేశ్ బాబు ఫ్యామిలీతో అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం మహేశ్ బాబుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వెకేషన్ సమయంలో మహేశ్, ఆయన భార్య నమ్రతా బిల్ గేట్స్‌ను కలుసుకున్నారు. లెజెండ్‌తో కొద్దిసేపు గడిపారు. ఈ మేరకు ఇన్ స్టాలో ఫొటోను షేర్ చేశారు. బిల్ గేట్స్‌ దార్శనికుడు, ప్రేరణగా పేర్కొన్నాడు. బిల్ గేట్స్‌ సింప్లిసిటీకి ఆశ్చర్యపోయాను అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ జంట బిల్ గేట్స్‌ను రెస్టారెంట్‌లో కలుసుకున్నట్లు కనిపిస్తోంది. మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ తమ టూర్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. యుఎస్ సందర్శించే ముందు, ఇద్దరూ తమ పిల్లలతో కలిసి ఇటలీకి వెళ్లి రోడ్ ట్రిప్ చేశారు.

 

Exit mobile version