Site icon HashtagU Telugu

Mahesh Babu : మహేష్ 8 డిఫరెంట్ లుక్స్.. SSRMB లేటెస్ట్ క్రేజీ అప్డేట్..!

Mahesh SSMB 29 Update coming on Dussehra

Mahesh SSMB 29 Update coming on Dussehra

Mahesh Babu సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో భారీ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ లో కె.ఎల్ నారాయణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. త్వరలో ముహూర్త కార్యక్రమాలు జరుపుకోనున్న ఈ సినిమా మొదటి నుంచి భారీ ప్లానింగ్ లో ఉన్నారు రాజమౌళి. ఈ సినిమా కోసం ఇప్పటికే మహేష్ డిఫరెంట్ లుక్ ట్రై చేస్తున్నాడని తెలిసిందే. గుబురు గడ్డ, బారు జుట్టు సినిమాలో మహేష్ కంప్లీట్ గా కొత్త గెటప్ తో కనిపిస్తారని తెలుస్తుంది.

ఇక సినిమా కోసం ఈమధ్యనే లుక్ టెస్ట్ జరగ్గా కొన్నిటిని ఓకే చేశారట. ఈ సినిమాలో మహేష్ మొత్తం 8 డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తారని. ఒక్కో లుక్ ఒకదానికి మించి మరొకటి ఉంటుందని తెలుస్తుంది. మహేష్ లుక్స్ తోనే సినిమాపై విపరీతమైన బజ్ ఏర్పడుతుందని అంటున్నారు. ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో వస్తున్న ఈ సినిమాను కూడా రాజమౌళి రెండు భాగాలుగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట.

సినిమా గురించి కంప్లీట్ డీటైల్స్ త్వరలో ఒక ప్రెస్ మీట్ పెట్టి వెల్లడిస్తారని తెలుస్తుంది. సినిమా బడ్జెట్.. షూటింగ్ డేస్.. రిలీజ్ డేట్ కూడా ప్రెస్ మీట్ లో రాజమౌళి చెబుతారని టాక్. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ని తీసుకుంటున్నాడు రాజమౌళి. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమాను తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నారు జక్కన్న.

RRR సినిమా తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమాగా ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. వాటికి తగినట్టుగానే సినిమా ఆడియన్స్ అందరికీ ఐ ఫీస్ట్ అందించేలా ప్లాన్ చేస్తున్నారట. సినిమా అనౌన్స్ మెంట్ రోజే టైటిల్ కూడా రివీల్ చేస్తారని. ఆర్.ఆర్.ఆర్ తరహాలో పాన్ వరల్డ్ వైడ్ ఒకటే టైటిల్ కుదిరేలా రాజమౌళి ఫిక్స్ చేస్తున్నారని తెలుస్తుంది.

Also Read : Sharukh Khan : ఇడ్లీ వడ రాం చరణ్.. షారుఖ్ పై విరుచుకు పడుతున్న మెగా ఫ్యాన్స్..!