Site icon HashtagU Telugu

1-Nenokkadine : ‘వన్ నేనొక్కడినే’ సినిమాకు ముందు అనుకున్న కథ వేరు.. అదేంటో తెలుసా..?

Mahesh Babu 1 Nenokkadine movie story change after finalizing movie

Mahesh Babu 1 Nenokkadine movie story change after finalizing movie

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్ లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘1:నేనొక్కడినే'(Nenokkadine). టైటిల్ తోనే భారీ అంచనాలు క్రియేట్ చేసుకున్న ఈ మూవీ 2014లో రిలీజ్ అయ్యి ఆడియన్స్ అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద డీలా పడింది. టైటిల్ చూసి సినిమాకి వెళ్లిన అభిమానులు మూవీలో ఓ రేంజ్ హీరోయిజం ఆశించారు. కానీ మాస్ ఇమేజ్ ఉన్న మహేష్ ని ఒక మానసిక సమస్యతో బాధ పడుతున్న వ్యక్తిగా చూపించడంతో ప్రతి ఒక్కరు నిరాశ చెందారు.

అయితే ఈ సినిమాకి ముందు అనుకున్న కథతో తీసి ఉంటే మూవీలో ఓ రేంజ్ హీరోయిజం పండేదని సుకుమార్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. నిర్మాతకి కూడా ఆ కథే వినిపించాడట. కానీ కథని డెవలప్ చేసే టైంలో, సినిమా తీసే ప్రోసెస్ లో ఎమోషన్ సైడ్ వెళ్లిపోవడంతో సినిమా అవుట్ పుట్ మారిపోయిందని పేర్కొన్నాడు. ఇంతకీ ఆ ఫస్ట్ వెర్షన్ ఏంటంటే.. ఇంటర్వెల్ ముందు వరకు హీరోని ఒక మానసిక సమస్యతో బాధ పడుతున్న వ్యక్తిగా చూపిస్తారు. ఇంటర్వెల్ టైంకి హీరోకి అసలు ఎటువంటి సమస్య ఉండదని. అదంతా తాను ప్లే చేస్తున్న గేమ్ అని చూపిస్తారు.

ఈ వెర్షన్ చెబుతునంతసేపు నిర్మాత.. కథలో హీరోయిజం విని ఉత్తేజం కలిగి ఎగరడం, సుకుమార్ ని కొట్టడం వంటివి చేశాడట. అయితే అలా సినిమా తీయడం వల్ల ఎమోషన్ క్యారీ అవ్వడం లేదు. కేవలం హీరోయిజం మాత్రమే కనిపిస్తుందని భావించిన సుకుమార్.. కథని ఎమోషనల్ వైపు సాగించాడు. అలా వచ్చిన కథే మనం చూస్తున్న సినిమా. అయితే ఈ రిలీజ్ అయిన వెర్షన్ అవుట్ పుట్ లో కూడా టైం గురించి అలోచించి కొన్ని సీన్స్ కట్ చేశారట. అందువల్లే సినిమా అర్ధంకాలేదు అనుకుంటా. కొంచెం జాగ్రత్త వహించి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది. అది నా తప్పే అని సుకుమార్ చాలాసార్లు బాధపడ్డాడు.

 

Also Read : Saloni Aswani : మర్యాదరామన్న హీరోయిన్ సలోని గుర్తుందా? ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ..