Site icon HashtagU Telugu

Mahesh Athidhi : ‘అతిధి’ మళ్లీ వస్తున్నాడు

Athidi Re Release

Athidi Re Release

టాలీవుడ్ (Tollywood) బాక్స్ ఆఫీస్ (Box Office) వద్ద సరైన సినిమాలు పడడమే లేదు. చిన్న చితక హీరోల సినిమాలు వస్తున్నప్పటికీ..మధ్య మధ్య లో పెద్ద హీరోలు వచ్చినప్పటికీ ప్రేక్షకులను మాత్రం సంతృప్తి పరచడం లేదు. ఈ క్రమంలో నిర్మాతలు రీ రిలీజ్ ల ట్రెండ్ ను మొదలుపెట్టారు. అగ్ర హీరోల చిత్రాలే కాదు సూపర్ హిట్ అయినా గత చిత్రాలను మళ్లీ సరికొత్త టెక్నలాజి తో రిలీజ్ చేస్తూ అలరిస్తున్నారు. చిరంజీవి , బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ , ప్రభాస్, అల్లు అర్జున్ , రామ్ చరణ్ , నాగార్జున , రవితేజ ఇలా చాలామంది హీరోలు నటించిన గత చిత్రాలను వారి వారి బర్త్డే లకు రీ రిలీజ్ చేస్తూ అలరిస్తున్నారు.

ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు – సురేందర్ రెడ్డి (Mahesh Babu – Surendar Reddy) కలయికలో తెరకెక్కిన ‘అతిధి’ (Athidhi) మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. 2007లో రిలీజ్ అయినా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేదు. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ వారి అంచనాలను అందుకోలేకపోయింది. అమృతారావు ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా..వక్కంతం వంశీ కథ అందించారు. మణిశర్మ మ్యూజిక్ చేసారు. ఈ మూవీ ఇప్పుడు న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న 4kలో రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి ఇప్పుడు ఈ మూవీ ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

Read Also : Yamaha Comic Con : యమహా నుండి కామిక్ కాన్