Site icon HashtagU Telugu

Mahesh AMB Classic : మహేష్ మరో మల్టీప్లెక్స్.. ఈసారి ఎక్కడంటే..!

Mahesh Amb Classic Multiplex In Rtc X Roads

Mahesh Amb Classic Multiplex In Rtc X Roads

Mahesh AMB Classic సూపర్ స్టార్ మహేష్ ఓ పక్క సినిమాలతో ఎంత బిజీగా ఉంటాడో తన బిజినెస్ విషయంలో కూడా అంతే ఫోకస్ గా ఉంటాడు. ఇప్పటికే మహేష్ ఏ.ఎం.బి మాల్ తో సక్సెస్ ఫుల్ గా మల్టీప్లెక్స్ బిజినెస్ నడిపిస్తుండగా ఇప్పుడు మరో మల్టీప్లెక్స్ కూడా సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది. ఏ.ఎం.బి తరహాలోనే మహేష్ ఈసారి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఏ.ఎం.ని క్లాసిక్ సినిమాస్ ను రెడీ చేస్తున్నారు. 7 స్క్రీన్స్ తో ఈ మల్టీప్లెక్స్ సిద్ధమవుతుందని తెలుస్తుంది.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సుదర్శన్ 70 ఎం.ఎం స్థానంలో ఏ.ఎం.బి క్లాసిక్ సినిమాస్ నిర్మిస్తారని తెలుస్తుంది. మహేష్ మల్టీప్లెక్స్ ఏ.ఎం.బి మాల్ సక్సెస్ అవ్వడంతో మరో మల్టీప్లెక్స్ ఈసారి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో నిర్మిస్తున్నరు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఏర్పాటు చేస్తున్న మొదటి మల్టీప్లెక్స్ ఇదే.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కి మంచి క్రేజ్ ఉంటుంది. ఎలాంటి భారీ బడ్జెట్ సినిమా అయినా సరే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సందడి ఒక రేంజ్ లో ఉంటుంది. అక్కడ ప్రతి థియేటర్ లో ఒక్కో హీరోకి ఒక్కో రికార్డ్ ఉంటుంది. మరి ఏ.ఎం.బి క్లాసిక్ సినిమాస్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Also Read : Operation Valentine Profits : రిలీజ్ ముందే లాభాల్లో వరుణ్ తేజ్ సినిమా.. ఇది కదా మెగా ప్లాన్ అంటే..!