ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘మహావతార్ నరసింహ’ (Mahavatar Narsimha) సినిమా ప్రస్తావన లేకుండా ఏ చర్చ సాగడం లేదు. మొదటి షో నుంచే సినిమా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూ, మౌత్ టాక్ ద్వారా భారీ హిట్‌గా మారింది. పెద్ద హీరోలు లేకుండా, స్టార్ డైరెక్టర్లు లేకుండా, భారీ సెట్స్ లేకుండా వచ్చిన ఈ చిన్న సినిమా ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. థియేటర్లలో చూసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాను “మస్ట్ వాచ్ మూవీ”గా సజెస్ట్ చేయడమే కాకుండా, సోషల్ మీడియాలో పోస్టులు, రివ్యూలతో సినిమాకు బజ్ పెంచుతున్నారు.
విడుదలైన 8 రోజులకే దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ సినిమా అనే రికార్డు నెలకొల్పిన ‘మహావతార్ నరసింహ’ ఇప్పుడు వసూళ్ల (Mahavatar Narsimha Collections) సునామీతో అందరిని ఆశ్చర్యపరుస్తోంది. హోంబలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించిన ప్రకారం ఈ చిత్రం 60.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అంతేకాకుండా, అమెరికాలో వన్ మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరడం గర్వకారణంగా మారింది. చిన్న సినిమాగా వచ్చి, అన్ని భాషల్లో పెద్ద సినిమాలకు షాక్ ఇస్తూ ముందుకు సాగుతోంది.
Ration Cards : రేషన్ కార్డుల తొలగింపుపై కేంద్రం సంచలన నిర్ణయం
రెండో వారంలో కూడా ‘మహావతార్ నరసింహ’ దూకుడు ఏమాత్రం తగ్గలేదు. రెండో శనివారానికే రూ.15 కోట్ల వసూళ్లు సాధించి, మొదటి శనివారానికి వచ్చిన రూ.4.60 కోట్లను మించి గొప్ప రికార్డు క్రియేట్ చేసింది. ఈ జోరుతో చూస్తుంటే త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెడుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బాలీవుడ్ బడా హీరో అజయ్ దేవగన్ నటించిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ సినిమా కూడా ఈ సినిమా వసూళ్ల ముందు సగమే రాబట్టడం గమనార్హం.
ఇంకా ధడక్ 2, సైయారా, కింగ్‌డమ్ వంటి సినిమాలు కలిపి చూసినా, ‘మహావతార్ నరసింహ’ కలెక్షన్ల దూకుడు ముందు నానిపోతున్నాయి. కేవలం కంటెంట్ పై నమ్మకంతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగిన సినిమా ఇది. యానిమేషన్ సినిమాలకూ భారతదేశంలో ఇదొక కొత్త మైలురాయిగా నిలుస్తుంది. పెద్ద స్టార్ కాస్టింగ్ లేకుండా ఓ మంచి కథ, ప్రాణం పెట్టిన టెక్నికల్ వర్క్‌తో ఎలా విజయం సాధించవచ్చో ఈ సినిమా మరోసారి నిరూపించింది. ప్రస్తుతం ‘మహావతార్ నరసింహ’ బాక్సాఫీస్ వద్ద నాన్-స్టాప్‌గా సునామీ సృష్టిస్తోంది.