Ravi Teja and Sreeleela: ధమాకా నుంచి ‘వాట్స్ హ్యాపెనింగ్’ లిరికల్ సాంగ్ రిలీజ్!

మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ధమాకా. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్

Published By: HashtagU Telugu Desk
Dhamaka

Dhamaka

మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ధమాకా. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈ రోజు ఈ చిత్రం నుండి వాట్స్ హ్యాపెనింగ్ లిరికల్ వీడియో విడుదల చేశారు మేకర్స్. భీమ్స్ సిసిరోలియో ఈ పాటని మనసుని హత్తుకునే మెలోడీ గా కంపోజ్ చేశారు. శేఖర్ మాస్టర్ ఈ పాటని చాలా గ్రేస్ ఫుల్ గా కోరియోగ్రఫీ చేశారు. శ్రీలీల డ్యాన్స్ మూమెంట్స్ స్టయిలీష్ గా ఆకట్టుకున్నాయి.

ఈ పాటకుసరస్వతి పుత్ర రామ జోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హీరోయిన్ మనసులోని ఫీలింగ్స్ ని అందంగా, మ్యాజికల్ గా ప్రజంట్ చేశారు. రమ్య బెహరా, భార్గవి పిళ్లై తమ వాయిస్ తో మెస్మరైజ్ చేశారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్ గా. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది.

  Last Updated: 12 Nov 2022, 11:40 AM IST