Site icon HashtagU Telugu

Magadheera Re Release : తెలుగు సినిమా రికార్డులు తిరగ రాసిన సినిమా మళ్లీ రాబోతుంది..

Magadheera Released

Magadheera Released

ఇటీవల తెలుగు లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. గతంలో సూపర్ హిట్ సాధించిన చిత్రాలు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆయా చిత్రాల హీరోల బర్త్ డే (Birthday) ల సందర్బంగా రీ రిలీజ్ (Re Release) అవుతూ అలరిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు రీ రిలీజ్ కాగా ..ఇప్పుడు తెలుగు సినిమా రికార్డులు తిరగ రాసిన సినిమా మళ్లీ రాబోతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – రాజమౌళి కలయికలో తెరకెక్కిన మగధీర (Magadheera ) చిత్రం..ఇప్పుడు చరణ్ బర్త్ డే (మార్చి 27) సందర్బంగా ఓ రోజు మందు అనగా మార్చి 26 న విడుదల చేయబోతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసి, తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మగధీర సినిమాను గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ (Allu Aravindh) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఇప్పుడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్ యర్రంశెట్టి రామారావు, అరిగెల కిషోర్ బాబు ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఈ సినిమా భారీ స్థాయిలో అత్యధిక థియేటర్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేస్తున్నామని, మమ్మల్ని ప్రోత్సహించి మాకు రీ రిలీజ్ చేసే అవకాశం కల్పించిన మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కి కృతజ్ఞతలు అని అన్నారు. తెలుగు ప్రేక్షకులు మెగా అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరించి మరోసారి ఘన విజయాన్ని అందించి రామ్ చరణ్ కు బర్త్ డే గిఫ్ట్ ఇస్తారని కోరుకుంటున్నాం అని అన్నారు.

Read Also : IPL 2024: పంత్ రెడీ.. ఢిల్లీ క్యాపిటల్స్ బలాలు – బలహీనతలు