హైదరాబాద్ : డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ ను మరోసారి షేక్ చేస్తోంది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ ను అరెస్ట్ చేయవద్దని హీరో తెలంగాణ హైకోర్టు ఇప్పటికే పోలీసులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నవదీప్‌ను డ్రగ్స్ వాడే వ్యక్తిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల దాడుల్లో పట్టుబడిన రామ్ చంద్ అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలంలో.. నవదీప్ తనతో కలిసి డ్రగ్స్ తీసుకున్నాడని రామ్ చంద్ పేర్కొన్నాడు. దీంతో టీఎస్ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు నవదీప్‌ను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు.
ఈ క్రమంలో ఇటీవల నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు హైదరాబాద్‌లోని నవదీప్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో నవదీప్ ఇంట్లో లేడని సమాచారం. మరోవైపు తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని నవదీప్ టీఎస్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నవదీప్ పిటిషన్‌పై సానుకూలంగా స్పందించిన హైకోర్టు మంగళవారం వరకు అరెస్టు చేయరాదని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇవాళ నవదీప్‌కు సంబంధించి నార్కోటిక్ బ్యూరో హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయనుంది. గీతామాసం 31వ తేదీన మాదాపూర్‌లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్‌లో డ్రగ్స్ పార్టీ జరిగింది. ఆ సమయంలో 13 మంది పోలీసులకు పట్టుబడ్డారు.
Also Read: Naga Chaitanya-Sobhita Dhulipala: శోభితతో నాగచైతన్య రెండో పెళ్లి, చక్కర్లు కొడుతున్న రూమర్స్!