Site icon HashtagU Telugu

Dhamaka Song: హోరెత్తిస్తోన్న రవితేజ ‘దండ కడియాల్’ లిరికల్ సాంగ్!

Dhamaka2

Dhamaka2

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja), త్రినాథరావు నక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ ధమాకా సినిమా విడుదలకు ముందే మ్యూజికల్ హిట్ అయ్యింది. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో విభిన్న ట్యూన్‌ లతో కూడిన ఆల్బమ్‌ ను స్కోర్ చేశాడు. ఆల్బమ్‌ లో క్లాస్, మాస్ బీట్స్ ఉన్నాయి. ఈ రోజు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐదవ పాట ‘దండ కడియాల్‌ ‘ (Dandakadiyal)ను విడుదల చేశారు.

భీమ్స్ సిసిరోలియో మాస్ , ఫోక్ నెంబర్స్ ని కంపోజ్ చేయడంలో తన మార్క్ ని మరోసారి నిరూపించుకున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలో చార్ట్‌బస్టర్ ఫోక్ నంబర్ గా జింతాక్‌ పాట నిలిచింది. ఇది దాదాపు 40 మిలియన్ల వ్యూస్ ని సాధించింది. దండకడియాల్ (Dandakadiyal) సినిమాలోని మరో సెన్సేషనల్ సాంగ్ కానుంది. ఈ ఊర మాస్ ఫోక్ నెంబర్ ని భీమ్స్ స్కోర్ చేసి పాడటమే కాకుండా సాహిత్యం కూడా రాశారు. అతనితో పాటు సాహితీ చాగంటి, మంగ్లీ ఈ పాటను ఉత్సాహంగా పాడారు. విజువల్స్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. రవితేజ డ్యాన్స్‌లు కన్నుల పండువగా ఉన్నాయి, ఇందులో శ్రీలీల రవితేజ (Ravi Teja) గ్రేస్, ఎనర్జీని మ్యాచ్ చేయడానికి ప్రయత్నించింది. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.

టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే , సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. డిసెంబర్ 23న ‘ధమాకా’ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది.

Also Read: Indian Racing League: ఇండియన్ రేసింగ్‌ లీగ్‌ ఫైనల్‌ పోటీలకు అంతా రెడీ