Site icon HashtagU Telugu

LV Prasad : ఎవరూ సాధించలేని రికార్డుని సృష్టించిన ఎల్వీ ప్రసాద్‌..

LV Prasad has created a record that no one can beat

LV Prasad has created a record that no one can beat

నటుడిగా, దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్‌గా, నిర్మాతగా, బిజినెస్ మెన్‌గా తెలుగు సినీ పరిశ్రమలో చెరిగిపోని ముద్ర వేసిన వ్యక్తి ‘ఎల్వీ ప్రసాద్'(LV Prasad). దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డు వంటి గొప్ప పురస్కారాలతో పాటు మరెన్నో ఘనతలు కూడా ఆయన సొంతం. కాగా ఆయన సాధించిన ఒక రికార్డుని మాత్రం ఎవరూ అందుకోలేరు. అలాంటి ఒక అద్భుత రికార్డుని ఆయన సృష్టించారు. ఇంతకీ ఆయన సాధించిన ఆ రికార్డు ఏంటి..?

ఎల్వీ ప్రసాద్ సాధించిన రికార్డు గురించి చెప్పాలంటే.. మీరు ముందుగా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ హిస్టరీ గురించి తెలుసుకోవాలి. తెలుగు, తమిళ్, హిందీ సినీ పరిశ్రమలు ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద పరిశ్రమలుగా కొనసాగుతున్నాయి. అయితే ఈ ఇండస్ట్రీల ప్రయాణం ఎప్పుడు మొదలయింది..? ఈ భాషల్లో తెరకెక్కిన మొట్టమొదటి టాకీ సినిమాలు ఏంటనేవి..? మీలో చాలా తక్కువమందికి తెలిసి ఉంటుంది.

మొదటిలో సౌండ్ లేకుండా మొగసైగలతోనే సినిమాలు వచ్చేవి. అయితే 1931 నుంచి సౌండ్ తో టాకీ సినిమాలు రావడం మొదలయ్యాయి. అలా తెలుగులో తెరకెక్కిన మొదటి మూవీ ‘భక్త ప్రహ్లాద’, తమిళ్ ఫస్ట్ మూవీ ‘కాళిదాస్’ (Kalidas), హిందీ మూవీ ‘ఆలం అరా’(Alam ara). తెలుగు, తమిళ్ చిత్రాలు 1932లో రిలీజ్ అవ్వగా, హిందీ మూవీ 1931లో విడుదలైంది. ఈ మూడు చిత్రాలతోనే ఎల్వి ప్రసాద్.. ఎవరూ సాధించలేని రికార్డుని సృష్టించారు.

ఈ మూడు చిత్రాల్లో ఏదో ఒక పాత్రలో ఆయన నటించారు. మూడు భాషల్లోని మొదటి టాకీ మూవీలో నటించిన ఏకైక నటుడిగా ఎల్వీ ప్రసాద్ నిలిచారు. మరి ఇలాంటి రికార్డుని సాధించడం లేదా మళ్ళీ సృష్టించడం అనేది జరగదు కదా. ఇక్కడ మరో రికార్డు కూడా ఉంది. తెలుగు, తమిళంలో తెరకెక్కిన తొలి చిత్రాలను డైరెక్ట్ చేసిన దర్శకుడిగా హెచ్‌ఎం రెడ్డి కూడా ఒక రికార్డుని క్రియేట్ చేశారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి అనేక సినిమాలు తీశారు.

 

Also Read : Kodi Ramakrishna : కోడి రామకృష్ణ తలకట్టు వెనుక ఉన్న కారణం ఏంటి..?