థియేటర్స్ లలో దుమ్ములేపిన లక్కీ భాస్కర్..ఇప్పుడు ఓటిటిలో దుమ్ములేపుతున్నాడు. వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా నటించిన చిత్రం లక్కీ భాస్కర్ (Lucky Bhaskar). ఈ చిత్రంలో సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి (Minakshi Choudhury) నటించగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments)పై ఈ సినిమా తెరకెక్కింది. దుల్కర్ సల్మాన్ వివిధ భాషలలో తన అద్భుతమైన నటనతో బహుభాషా స్టార్ అని నిరూపించుకున్న సంగతి తెలిసిందే. మహానటి, సీతా రామం వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తెలుగు సినీ ప్రియులలో భారీ ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న సల్మాన్..ఇప్పుడు లక్కీ భాస్కర్ అంటూ దీపావళి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నాడు.
విడుదలకు ముందే పాజిటివ్ బజ్ తెచ్చుకున్న భాస్కర్…మొదటి అట తోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాడు. అద్భుతమైన స్క్రీన్ ప్లే తో వెంకీ అదరగొట్టడం , సల్మాన్ తనదైన యాక్టింగ్ తో మెప్పించేసరికి సినిమా చూసిన ప్రతి ఒక్కరు సూపర్ అంటూ చెపుతుండడం తో సినిమా చూసేందుకు ఆడియన్స్ పరుగుపెట్టారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. థియేటర్స్ లో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా అంతే అదరగొడుతుంది. నవంబర్ 28 నుంచి లక్కీ భాస్కర్ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు 15 దేశాల్లో టాప్-10 లిస్టులో చోటు దక్కించుకుంది. అంతే కాదు సోషల్ మీడియా లో కూడా లక్కీ భాస్కర్ మూవీ క్లిప్స్ ను షేర్ చేస్తూ మరింతగా వైరల్ చేస్తున్నారు. దీంతో సినిమా చూడాలని అందరిలో ఆత్రుత పెరుగుతుంది. ఏది ఏమైనప్పటికి భాస్కర్..అన్ని చోట్ల లక్కీ అనిపించుకున్నాడు.
Read Also : Tritiya Jewellers : హీరోయిన్స్‌కే కుచ్చుటోపీ పెట్టిన మోసగాడు.. కటాకటాల వెనక్కి కాంతిదత్