L2 Empuraan Trailer : మోహన్ లాల్ హీరోగా మరో హీరో పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మలయాళంలో వచ్చిన లూసిఫర్ సినిమా పెద్ద హిట్ అయింది. తెలుగులో కూడా డబ్బింగ్ తో మెప్పించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ ‘L2 ఎంపురాన్’ అనే టైటిల్ తో రాబోతుంది. ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చ్ 27 పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది.
మొదటి పార్ట్ లో మోహన్ లాల్ ఫ్లాష్ బ్యాక్ లో ఖురేషి అబ్రామ్ అని చూపించారు. దీంతో ఖురేషి అబ్రామ్ ఎవరు అనేది ఈ సినిమాలో చూపిస్తుండటంతో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్, అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, సానియా అయ్యప్పన్, సాయికుమార్, బైజు సంతోష్, ఫాజిల్, సచిన్ ఖేదేకర్, నైలా ఉష, గిజు జాన్, నందు, శివాజీ గురువాయూర్, ఎస్ మణికుట్టన్.. ఇలా అనేకమంది స్టార్స్ నటించారు.
తెలుగులో ఈ సినిమాని దిల్‌రాజు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ‘L2 ఎంపురాన్’ టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్ అదిరిపోయింది. భారీ యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు ఫ్యామిలీ ఎమోషన్, స్టీఫెన్ ఫ్లాష్ బ్యాక్ ఖురేషి అబ్రామ్ ఎపిసోడ్.. ఇలా సినిమా ఆసక్తిగా ఉండబోతుందని తెలుస్తుంది. మీరు కూడా L2 ఎంపురాన్ ట్రైలర్ చూసేయండి..
Also Read : Pawan Kalyan : ఆయనకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది : చిరుపై పవన్ పోస్ట్