Site icon HashtagU Telugu

Ram Charan : రామ్ చరణ్ గొప్ప నటుడు.. ఫ్రెంచ్ యాక్టర్ ప్రశంసలు..

Lucas Bravo Heaps, Ram Charan, Rrr, Game Changer

Lucas Bravo Heaps, Ram Charan, Rrr, Game Changer

Ram Charan : ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్నారు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న రామరాజు పాత్రని చరణ్ పోషించిన తీరు ప్రతి ఒక్కర్ని ఆకట్టుకుంది. రామ్ చరణ్ నటనకి కేవలం ఆడియన్స్ మాత్రమే కాదు, సినీ సెలబ్రిటీస్ కూడా ఫిదా అవుతున్నారు. కేవలం ఇండియన్ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ ఫిలిం మేకర్స్ నుంచి కూడా చరణ్ కి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటికే హాలీవుడ్ టాప్ డైరెక్టర్స్, పాప్ యాక్టర్స్.. చరణ్ ని అభినందిస్తూ కామెంట్స్ చేసిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇక తాజాగా ఒక ఫేమస్ ఫ్రెంచ్ యాక్టర్ చరణ్ గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఫ్రెంచ్ యాక్టర్ ‘లుకస్ బ్రేవో’ ఒక ప్రముఖ టాక్ షోలో మాట్లాడుతూ.. “ఆర్ఆర్ఆర్ సినిమా నేను చూసాను. ఆ మూవీలో నటించిన రామ్ చరణ్ నటన అద్భుతం. ఎమోషనల్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ ని చాలా బాగా చేసాడు” అంటూ చరణ్ పై ప్రశంసలు కురిపించారు. ఇక ఈ వీడియోని చరణ్ ఫ్యాన్స్ నెట్టింట వైరల్ చేస్తూ సందడి చేస్తున్నారు.

మరి ఆర్ఆర్ఆర్ వచ్చిన ఈ క్రేజ్ ని రామ్ చరణ్ ఎలా సద్వినియోగం చేసుకుంటారో చూడాలి. ప్రస్తుతం రామ్ చరణ్ నుంచి గేమ్ ఛేంజర్ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతుంది. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతుంది. డిసెంబర్ లో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. మరి ఆర్ఆర్ఆర్‌తో చరణ్‌కి వచ్చిన క్రేజ్ ని ఈ మూవీ రెట్టింపు చేస్తుందా..? లేదా..? చూడాలి. చరణ్ ఫ్యాన్స్ అయితే ఈ మూవీ పై భారీ అంచనాలే పెట్టుకున్నారు.