Site icon HashtagU Telugu

Keerti Suresh : కీర్తి సురేష్ ఇంటికెళ్లి మరి పెళ్లి ప్రపోజల్ చేశాడట..!

Love Proposals for Keerti Suresh from Fan

Love Proposals for Keerti Suresh from Fan

Keerti Suresh కీర్తి సురేష్ మహానటి సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం సౌత్ లో సూపర్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. తెలుగు, తమిళ సినిమాలతో అదరగొడుతున్న అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కీర్తి సురేష్ లేటెస్ట్ గా దసరా సినిమాలో వెన్నెల పాత్రకు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ సొంతం చేసుకుంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో నాని హీరోగా నటించిన దసరా సినిమాలో కీర్తి సురేష్ కూడా తన అభినయంతో మెప్పించింది.

సినిమాలో వెన్నెల (Vennela) పాత్రలో ఆమె చేసిన నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఐతే తనకు ఫిల్మ్ ఫేర్ వచ్చిన సందర్భంగా కీర్తి సురేష్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తనకు వచ్చిన ఒక పెళ్లి ప్రపోజల్ (Marriage Proposal) గురించి చెప్పి షాక్ ఇచ్చింది అమ్మడు. తనని అభిమానించే ఒక వ్యక్తి తన ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అతన్ని చూసి ముందు భయపడినా తర్వాత అతను నాపై చూపించే అభిమానం ప్రేమ నచ్చాయి అన్నది కీర్తి సురేష్.

సినీ తారలుగా తాము పడుతున్న కష్టానికి ఇలా అభిమానుల నుంచి చెప్పలేనంత ప్రేమ వస్తుంది. దీని కోసం ఎంత కష్టపడినా పర్వాలేదని అనిపిస్తుంది. కీర్తి సురేష్ మంచి నటి ఆమెకు తగిన పాత్ర ఇస్తే చాలు విశ్వరూపం చూపిస్తుంది. అందుకే ఆమె అంటే ఆడియన్స్ అభిమానం చూపిస్తారు. మహానటి సినిమాతో కీర్తి క్రేజ్ డబుల్ అయ్యింది.

రీసెంట్ గా వచ్చిన కల్కి సినిమాలో కీర్తి సురేష్ తన వాయిస్ ఓవర్ అందించింది. ఐతే రీసెంట్ గా చిరంజీవి, విజయ్ లలో బెస్ట్ డాన్సర్ గా విజయ్ ని ఎంపిక చేసుకున్నందుకు కీర్తి సురేష్ మీద విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. చిరంజీవి డాన్స్ ని వేరొకరితో పోల్చేంత పెద్ద దానివా అంటూ మెగా ఫ్యాన్స్ ఆమె మీద ఎటాక్ చేస్తున్నారు.

Also Read : Mega Fans : దళపతి విజయ్ మీద మెగా ఫ్యాన్స్ ఎటాక్.. అంతా ఆ హీరోయిన్ వల్లే..!