Site icon HashtagU Telugu

Crazy Combination: మరో మూవీకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్, లోకేష్ కనగరాజ్ తో భారీ బడ్జెట్ మూవీ!

1

1

టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్, మావెరిక్స్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో ఆసక్తికర సినిమా రాబోతున్నట్టు సమాచారం. కొత్త సినిమా ప్రాజెక్ట్ కోసం జతకట్టడానికి సిద్ధంగా ఉన్నారు, ఇది అభిమానుల్లో అంచనాలను పెంచేస్తోంది. లోకేశ్ అటు తమిళంలో, ఇటు ప్రభాస్ కు తెలుగులో మంచి క్రేజ్ ఉండటంతో ఈ మూవీపై భారీ హైప్ ఏర్పడే అవకాశాలున్నాయి. ప్రభాస్ మెస్మరైజింగ్ స్క్రీన్ ప్రెజెన్స్, లోకేష్ కనగరాజ్ అసాధారణ కథా నైపుణ్యం ఉంది. వీరి కాంబినేషన్ లో మూవీ సెట్ అయితే కొత్త రికార్డులు తిరుగ రాసే అవకాశం ఉంది.

తన అద్భుతమైన నటనకు పేరుగాంచిన ప్రభాస్ ప్రపంచ వ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులను సంపాందించుకున్నారు.  “మాస్టర్”, “విక్రమ్” వంటి హిట్స్ అందించిన లోకేష్ కనగరాజ్ కు స్టార్ డైరెక్టర్ అనే పేరుంది. మరి ప్రభాస్ తో ఎలాంటి సినిమా తీయబోతున్నాడనేది టాలీవుడ్ తో కోలీవుడ్ లోనూ ఆసక్తిగా మారనుంది. అయితే ఈ వార్త అధికారికంగా వెలువడాల్సి ఉంది.

ప్రభాస్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘సలార్‌-1’ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్‌ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. గత నెలలో విడుదలైన టీజర్‌ భారీ యాక్షన్‌ ఘట్టాలు, పవర్‌ఫుల్‌ ఎలివేషన్స్‌తో ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా కథాంశం గురించి ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూన్‌ బయటికొచ్చింది. అంతర్జాతీయ మాఫియా నేపథ్య కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులను దృష్టిలో పెట్టుకొని రొమాంచితమైన యాక్షన్‌ సీక్వెన్స్‌ను డిజైన్‌ చేశారని తెలిసింది.

Also Read: Rahul Sipligunj: అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆర్ఆర్ఆర్ సింగర్, గోషామహల్ నుంచి పోటీ?