Site icon HashtagU Telugu

AAA : బన్నీ కోసం ఎన్టీఆర్ ట్రైనర్ రంగంలోకి !

Alluarjun Fitness Trainer L

Alluarjun Fitness Trainer L

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం అట్లీ (Atlee Kumar) దర్శకత్వంలో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా కోసం బన్నీ తన బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చుకుంటున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం ఎన్టీఆర్‌కు శిక్షణ ఇచ్చిన ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్ (Fitness Trainer Lloyd) ఇప్పుడు బన్నీ కోసం పనిచేయనున్నాడు. హాలీవుడ్ టెక్నీషియన్లు, వీఎఫ్ఎక్స్ స్టూడియోలతో కలిసి రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది. ఇటీవల విడుదలైన అట్లీ-బన్నీ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వీడియోకు కూడా అద్భుత స్పందన లభించింది.

AI Studio : ఏఐ స్టూడియోకు శ్రీకారం.. లాభాలేంటో చెప్పిన దిల్‌రాజు

వాస్తవానికి బన్నీ త్రివిక్రమ్‌తో సినిమా చేయాల్సి ఉంది. కానీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుండటంతో .. అట్లీ కథను ముందుకు తీసుకెళ్లాడు. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ బన్నీ కెరీర్‌లోనే కాదు, టాలీవుడ్‌లో కూడా కొత్త మైలురాయిగా నిలవనుంది. పుష్ప రాజ్‌ తరహాలో మాస్ లుక్ నుంచి స్టైలీష్ లుక్‌కి మారిపోతున్న బన్నీ కొత్తగా, ఫ్రెష్‌గా కనిపించనున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా రావాలి ఉంది. సన్ పిక్చర్స్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. పుష్ప 2 తర్వాత బన్నీ మార్కెట్ రెండు వేల కోట్ల దాకా పెరిగిన నేపథ్యంలో ఈ సినిమా కనీసం మూడు వేల కోట్ల వసూళ్లను టార్గెట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.