Site icon HashtagU Telugu

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ నెక్ట్స్ సినిమాల లిస్ట్

Vijay Deverakonda

Vijay Deverakonda

Vijay Deverakonda: సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న భారీ పాన్ ఇండియా మూవీ ఫ్యామిలీ స్టార్. పరశురామ్ తెరకెక్కిస్తోన్న ఫ్యామిలీ స్టార్ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు. ఇప్పుడు సమ్మర్ లో రిలీజ్ కి రెడీ అయ్యింది. దేవర రావాల్సిన ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ వస్తున్నాడు. అయితే.. ఫ్యామిలీ స్టార్ తర్వాత విజయ్ చేసే సినిమాల ఏంటి అనేది ఆసక్తిగా మారింది. సుకుమార్ తో విజయ్ సినిమా చేయాలి కానీ.. సుకుమార్ పుష్ప 2 తర్వాత పుష్ప 3 చేసే ఆలోచనలో ఉన్నాడట. ఆతర్వాత ప్రభాస్, చరణ్ లతో సినిమాలు చేయాలి అనుకుంటున్నాడు సుకుమార్.

అందుచేత విజయ్ తో సుకుమార్ సినిమా చేయడానికి చాలా టైమ్ పడుతుంది. కాబట్టి విజయ్ స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడం పై కన్నా యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికే ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. ఫ్యామిలీ స్టార్ తర్వాత గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయనున్నాడు. ఇందులో విజయ్ పోలీసాఫీసర్ గా కనిపిస్తాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇందులో కొత్త లుక్ లో చాలా ఫ్రెష్ గా కనిపిస్తాడట. శ్రీలంకలో ఎక్కువ భాగం షూటింగ్ చేయనున్నారు. ఈ ఇయర్ లోనే ఈ మూవీని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

ఇక గౌతమ్ తో మూవీ తర్వాత రవికిరణ్‌ కోలాతో సినిమా చేయనున్నాడు. ఈ చిత్రాన్ని కూడా దిల్ రాజు నిర్మించనున్నాడని తెలిసింది. ఇదొక పీరియాడికల్ క్రైమ్ మూవీ అని.. కథ బాగా నచ్చడంతో విజయ్, దిల్ రాజు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. వీటితో పాటు రాహుల్ సాంకృత్యన్ తో మూవీ చేయడానికి కూడా ఓకే చెప్పాడట. అలాగే తమిళ డైరెక్టర్ అరుణ్ మతేశ్వరన్, కన్నడ డైరెక్టర్ నర్తన్ కూడా విజయ్ తో సినిమాలు చేసేందుకు చర్చలు జరుపుతున్నారని తెలిసింది. మొత్తానికి లైనప్ బాగానే ఉంది. మరి.. ఈ సినిమాలతో విజయ్ ఆశించిన సక్సెస్ సాధించి ఫుల్ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.

Also Read: Suryakumar Yadav: ముంబై ఇండియ‌న్స్‌కు షాక్‌.. జ‌ట్టులోకి స్టార్ బ్యాట్స్‌మెన్ డౌటే..?

Exit mobile version