Site icon HashtagU Telugu

Veera Dheera Sooran : ‘వీర ధీర శూర’కు లైన్ క్లియర్..షోస్ స్టార్ట్

Veera Dheera Sooran Telugu

Veera Dheera Sooran Telugu

విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన ‘వీర ధీర శూర’ (Veera Dheera Sooran) సినిమా ఉదయం షోలు రద్దవడంతో అభిమానుల్లో నిరాశ నెలకొన్నా, చివరికి ఊరట లభించింది. అనివార్య కారణాల వల్ల ఈరోజు మార్నింగ్ షోలు ప్రదర్శించలేకపోయారు. అయితే సాంకేతిక కారణాలను అధిగమించిన చిత్ర బృందం ఈవెనింగ్ షో నుంచే ప్రదర్శన ప్రారంభమవుతుందని స్పష్టత ఇచ్చింది. తెలుగు డిస్ట్రిబ్యూటర్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

BCCI Central Contract: టీమ్ ఇండియాలో మార్పులు.. ఈనెల 30న బీసీసీఐ కీల‌క‌ సమావేశం!

అలాగే ఇప్పటికే రద్దైన షోల టిక్కెట్లకు రీఫండ్ అందిస్తామని థియేటర్ల యాజమాన్యాలు ప్రకటించాయి. సినిమా చూసేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇది ఉపశమనంగా మారింది.
అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్, దుషారా విజయన్, ఎస్జే సూర్య ముఖ్యపాత్రల్లో నటించారు. విక్రమ్ మరోసారి విభిన్నమైన గెటప్‌తో కనిపించబోతుండగా, ఎస్జే సూర్య తనదైన నటనతో ఆకట్టుకుంటారని టాక్. తెలుగులోనూ ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈవెనింగ్ షో నుంచి సినిమాను ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రదర్శించనున్నట్టు డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు.

Excise Police Stations: 14 కొత్త ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లకు లైన్‌ క్లియర్‌!