Site icon HashtagU Telugu

SriramChandra: రాజకీయ నాయకుల కోసం ఇలా!?.. మాలాంటి సామన్యులకు ఇబ్బందే: సింగర్ శ్రీరాంచంద్ర

Singer Sreerama Chandra Complaints To Cm Kcr Ktr For His Flight Missed Detailsd

Singer Sreerama Chandra Complaints To Cm Kcr Ktr For His Flight Missed Detailsd

SriramChandra: రాజకీయ నాయకులు ఏదైనా ప్రోగ్రాం అటెండ్ అవుతున్నారంటే ఉండే హడావిడి మామూలుగా ఉండదు. అయితే ఇలాంటి హడావిడి చేసే క్రమంలో సామాన్యులు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది. చాలాసార్లు రోడ్ల మీద కార్యక్రమాలు పెట్టుకోవడం వల్ల ట్రాఫిక్ సమస్యలు వస్తుంటాయి. మరికొన్నిసార్లు మొత్తం రోడ్లనే బ్లాక్ చేస్తుంటారు. సింగర్ శ్రీరాంచంద్రకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది.

ఈవెంట్ కోసం గోవా వెళ్లాల్సిన తనకు ట్రాఫిక్ వల్ల సమస్య తలెత్తిందని, ఫ్లైట్ మిస్ అయ్యానని సింగర్ శ్రీరాంచంద్ర ఓ వీడియోను నెట్టింట పోస్ట్ చేశాడు. తన వీడియోను తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేశాడు. దీంతో ఇప్పుడు శ్రీరాంచంద్ర వీడియోతో పాటు అతడు లేవనెత్తిన సమస్య నెట్టింట చర్చకు దారి తీసింది.

సింగర్ శ్రీరాంచంద్ర ట్వీట్ చేస్తూ.. ‘ఒక ఈవెంట్ కోసం నేను గోవా వెళ్లాల్సి ఉంది. విమానాశ్రయానికి బయలుదేరిన నాకు ఓ ఫ్లై ఓవర్ బ్లాక్ చేసినట్లు ఇక్కడికి వచ్చాకే తెలిసింది. ఒక రాజకీయ నాయకుడి కోసం ఇలా ఫ్లై ఓవర్ ను బ్లాక్ చేశారు. దీంతో చుట్టూ తిరిగి ఎయిర్ పోర్టుకు చేరుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్ ఆగిపోవడంతో నాకు ఆలస్యమైంది. నేను గోవా వెళ్లాల్సిన ఫ్లైట్ మిస్ అయింది. ఇప్పుడు మరొక విమానంలో గోవా చేరుకోవడం కష్టమైన పని. నాతో పాటు 15 మంది ఈ కారణంగానే ఫ్లైట్ మిస్సయ్యారు. రాజకీయ నాయకుల కోసంఇలా చేయడం వల్ల మాలాంటి సామాన్యులు ఇబ్బందిపడుతున్నారు. దయచేసి దీని గురించి ఆలోచించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను’ అని వివరించాడు.

కాగా ఇలాంటి పరిస్థితులు తమకు కూడా ఎదురయ్యాయంటూ పలువురు నెటిజన్లు తమ అనుభవాలను కామెంట్ల రూపంలో పంచుకున్నారు. ఈ పరిస్థితి ఎప్పటికీ మారదు అని కొందరు కామెంంట్ చేస్తే, రాజకీయ నాయకులు మారినప్పుడే ఇది సాధ్యం అంటూ మరికొందరు కామెంట్ చేశారు. మొత్తానికి ఒక్కరి వల్ల చాలామంది సామాన్యులు ఇబ్బందిపడుతున్నారన్న శ్రీరాంచంద్ర ఆవేదనలో మాత్రం వాస్తవం ఉందని మెజార్టీ జనాలు అంగీకరిస్తున్నారు.