Site icon HashtagU Telugu

Vijay Devarakonda: లైగర్ కు ‘ఈడీ’ దెబ్బ.. విచారణకు విజయ్ దేవరకొండ!

Vijay Devarakonda

Vijay Devarakonda

టాలీవుడ్ లో  లైగర్ మూవీ పట్ల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా యూని‌ట్‌కు ఈడీ అధికారులు వరుసగా నోటీసులు జారీ చేస్తున్నారు. లైగర్ చిత్రానికి భారీ బడ్జెట్‌ను కేటాయించడమే చిత్ర యూనిట్‌కు తలనొప్పిగా మారింది. ఈ సినిమాకు ఇంత భారీ బడ్జెట్‌ను ఎలా సమకూర్చారని ఈడీ ఆరా తీస్తోంది. తాజాగా ‘లైగర్’ హీరో విజయ్ దేవరకొండను ఈ అంశంపై విచారణ చేసేందుకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.

అధికారులు ఇచ్చిన నోటీసుల ప్రకారం విజయ్ దేవరకొండ కొద్దిసేపటి క్రితమే ఈడీ ఆఫీసుకు చేరుకున్నాడు. లైగర్ మూవీకి భారీ పెట్టుబడులు ఎక్కడ నుంచి వచ్చాయి? ప్రపంచ బాక్సర్ మైక్ టైసన్ కు ఎంత మొత్తంలో డబ్బును అందించారు? లాంటి విషయాలపై విజయ్ దేవరకొండను ప్రశ్నిస్తున్నారు. లైగర్ లావాదేవీలపై ఇప్పటికే ఈడీ అధికారులు ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాధ్, నిర్మాత ఛార్మీ కౌర్‌లను విచారించిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ,  పూరీ జగన్నాధ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘లైగర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయ్యింది.

ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో చిత్ర యూనిట్ ప్రొడ్యూస్ చేయడంతో భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. లైగర్ పెట్టుబడులపై విజయ్ దేవరకొండ ఈడీ ముందుకు హాజరుకావడంతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీలో భారీ పెట్టుబడులపై కాంగ్రెస్ నేత జడ్సన్ ఈడీ అధికారులకు ఫిర్యాదు చేయడం, లైగర్ పెట్టుబడుల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందని ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే.

Exit mobile version