Site icon HashtagU Telugu

Puri What Next? పూరికి ‘లైగర్’ దెబ్బ.. ‘ఇస్మార్ట్ శంకర్-2’ కు సిద్ధం!

Puri

Puri

‘లైగర్’ పంచ్ తో ఘోరంగా దెబ్బతిన్న పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే ప్రకటించిన జేజీఎం (జనగణమణ) ఇప్పుడు ఆగిపోయిందని అంటున్నారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమా కోసం నిర్మాతలు 20 కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. ‘మై హోమ్ గ్రూప్’ JGMలో రూ. 20 కోట్లు పెట్టుబడి పెట్టింది, కానీ ఇప్పుడు పూరి iSmart శంకర్-2 తెరకెక్కించాలనుకుంటున్నాడు.

అయితే విజయ్ దేవరకొండ మై హోమ్ గ్రూప్ కోసం ప్రత్యేకంగా ఓ సినిమా చేయనున్నాడు. ఆ విధంగా వారి పెట్టుబడి మొత్తం ఆ మై హోమ్ కు ఇచ్చినట్టవుతుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషీ సినిమా చేస్తున్నాడు, దీని తర్వాత దిల్ రాజు కోసం ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. కాబట్టి ఖుషీ తర్వాత విజయ్ మై హోమ్స్ కోసం ఒక సినిమా, దిల్ రాజు కోసం మరో సినిమా చేయనున్నాడు. కాబట్టి ఈ అసైన్‌మెంట్‌ల తర్వాత మాత్రమే JGM చిత్రం వచ్చే అవకాశాలున్నాయి.

Exit mobile version