‘Liger’ Lowest Rated : విజయ్ దేవరకొండకు షాక్.. లైగర్ కు లోయెస్ట్ రేటింగ్!

టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ 'లైగర్'తో ఆగష్టు 25న ప్రేకక్షుల ముందుకొచ్చాడు.

Published By: HashtagU Telugu Desk
Liger

Liger

టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ ‘లైగర్’తో ఆగష్టు 25న ప్రేకక్షుల ముందుకొచ్చాడు. ఈ మూవీ ద్వారా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు విజయ్. విడుదలకు ముందే చిత్రనిర్మాతలు,  మొత్తం టీమ్ విజయంపై నమ్మకంతో ఉన్నారు. అయితే ఈ మూవీకి కొన్నిచోట్లా నెగిటివ్ రావడం మొదలైంది. మొదటి రోజే  మూవీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ చిత్రం ఇప్పుడు IMDbలో 2022లో అత్యంత తక్కువ రేటింగ్ పొందిన భారతీయ చిత్రంగా నిలిచిపోవడంతో లైగర్ టీంకు షాక్ ఇచ్చినట్టు అయ్యింది.

16,551 ఓట్ల ఆధారంగా లిగర్ 10కి 1.7 శాతం మాత్రమే మొగ్గు చూపారు. ఈ సినిమాతో పోలిస్తే.. అమిర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా 5, రక్షా బంధన్ 4.6, దోబారా 2.9, షంషేరా 4.9 వంటి ఇతర చిత్రాలున్నాయి. ఏది ఏమైనప్పటికీ, లైగర్‌పై ఇంకా ఆశ ఉంది. ఎందుకంటే ఇది కేవలం ఒక రోజు ఆధారంగా రేటింగ్ నిర్ణయించబడింది. రాబోయే రోజుల్లో లైగర్ రేటింగ్ మెరుగుపడొచ్చు. కాగా లైగర్ థియేటర్లలో సందడి చేస్తున్న సందర్భంగా విజయ్ దేవరకొండ, పూరి, అనన్య, చార్మి హైదరాబాద్ లోని పెద్దమ్మ టెంపుల్ ను సందర్శించుకొని పూజలు చేశారు.

  Last Updated: 27 Aug 2022, 01:09 PM IST