Site icon HashtagU Telugu

Liger: షారుఖ్ ఖాన్‌కే గురి పెట్టిన విజయ్ దేవరకొండ.. అది కొట్టేయడమే తన కల అంటూ?

Vijay Devarakonda

Vijay Devarakonda

విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నాడో అందరికీ తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆగస్ట్ 25న రాబోతోన్న తన లైగర్ సినిమాను వీలైనంతగా ప్రమోట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే విజయ్ దేశమంతా కూడా చుట్టేస్తున్నాడు. అభిమానులకు దగ్గరగా ఉంటున్నాడు. వారిలో ఒకరిలా కలిసిపోతోన్నాడు. దేశంలోని నలుమూలలా ప్రచారం చేసేస్తున్నాడు.

అయితే ఇక నేషనల్ మీడియాతో విజయ్ మరింతగా యాక్టివ్ అవుతున్నాడు. జాతీయ మీడియాతోనే విజయ్ ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నాడు. సినిమాను మాగ్జిమం పుష్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈక్రమంలో మీడియా నుంచి విజయ్‌కి వింత వింత ప్రశ్నలు ఎదురవుతుంటాయి. వాటికి విజయ్ చెప్పే సమాధానాలు కూడా మరింత వైరల్ అవుతుంటాయి. అలాంటి ఓ సమాధానం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ అనే టైటిల్స్ షారుఖ్ ఖాన్‌కు యాప్ట్‌గా సరిపోతోంటాయి. గత రెండు దశాబ్దాలుగా షారుఖ్ బాలీవుడ్‌కు బాద్ షాలా ఏలేస్తున్నాడు. ఈ మధ్య షారుఖ్ కాస్త డల్ అయి సినిమాలను పక్కన పెట్టేశాడు. అది వేరే విషయం. ఇప్పుడు షారుఖ్ వరుసగా సినిమాలు లైన్లో పెట్టేశాడు. అయితే విజయ్ మాత్రం షారుఖ్ దగ్గరి నుంచి ఆ కింగ్ టైటిల్‌ను కొట్టేయాలని అనుకుంటున్నాడట.

అసలే విజయ్ దేవరకొండకు సరైన ట్యాగ్ లేదు. తెలంగాణ మెగాస్టార్ అని కొన్నాళ్లు అన్నారు. అయితే తనను సూపర్ స్టార్ అని పిలుస్తుంటే.. ఎలాగో ఉందని, ఇప్పుడు ఆ ట్యాగ్‌కు తాను సరిపోనని, సాధించాల్సింది ఇంకా ఎంతో ఉందని విజయ్ చెబుతుంటాడు.

Exit mobile version