Dimple Hayathi : పార్కింగ్ వివాదం అనంతరం డింపుల్ కి ప్రాణహాని.. అనుమానిత కాల్స్.. డింపుల్ ఇంటికి అనుమానిత వ్యక్తులు..

డింపుల్ హయతి, డీసీపీ రాహుల్ ఇష్యూలో తాజాగా నేడు మరోసారి డింపుల్ తరుపు న్యాయవాది పాల్ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ..

  • Written By:
  • Publish Date - May 25, 2023 / 08:00 PM IST

గత రెండు రోజులుగా హీరోయిన్ డింపుల్ హయతి(Dimple Hayathi) వార్తల్లో నిలిచింది. తను నివాసం ఉండే అపార్ట్మెంట్స్ లోనే నివాసం ఉంటున్న హైదరాబాద్(Hyderabad) ట్రాఫిక్ విభాగంలో DCP గా పనిచేసే ఓ IPS ఆఫీసర్ తో, అతని డ్రైవర్ తో పార్కింగ్ స్థలం విషయంలో గొడవ పడుతుందని, అతను ఉపయోగించే ప్రభుత్వ కారుని కాలితో తన్నింది, తన కారుతో ఢీ కొట్టి డ్యామేజ్ చేసిందని.. IPS ఆఫీసర్ కార్ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డ్రైవర్, ఆ IPS ఆఫీసర్ ఎంత చెప్పినా, పద్దతిగా మాట్లాడాలని చూసినా డింపుల్ వినలేదని పలు మార్లు గొడవ పెట్టుకుందని ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు డింపుల్, డింపుల్ తో పాటు నివసించే అతని బాయ్ ఫ్రెండ్ విక్టర్ డేవిడ్ లపై ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కింద కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కి పిలిపించి హెచ్చరించారు. డింపుల్ కూడా తనదేమి తప్పులేదని ఆ IPS ఆఫీసర్ మీద కేసు పెట్టబోతే పోలీసులు తీసుకోలేదు. దీంతో పవర్ ఉందని తప్పులు చేస్తున్నారు అంటూ ట్వీట్ చేసింది డింపుల్. అంతే కాకుండా న్యాయంగా పోరాడతాం అని లాయర్ ని నియమించుకుంది. మొదటి రోజే లాయర్ మీడియాతో మాట్లాడుతూ DCP కావాలని డింపుల్ ని వేధిస్తున్నాడని పలు వ్యాఖ్యలు చేసి వాళ్ళు తప్పుచేసి ఒక సెలబ్రిటీ మీద తప్పుడు కేసు పెట్టారన్నారు.

తాజాగా నేడు మరోసారి డింపుల్ తరుపు న్యాయవాది పాల్ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. డింపుల్ పై తప్పుడు ఫిర్యాదు చేశారు. డీసీపీ కార్ కవర్ డింపుల్ తీసేశారు అని ఎఫ్ఐఆర్ లో రాశారు. డింపుల్ తొలగించినట్టు ఫుటేజ్ బయట పెట్టండి. డీసీపీ అబద్దాలు ఆడుతున్నాడు. తన డ్రైవర్ ను కాపాడుకునేందుకు ఇదంతా చేస్తున్నాడు. రెండు రోజుల నుంచి డ్రైవర్ ఎందుకు బయటకు రావడం లేదు చెప్పాలి. ట్రాఫిక్ పోలీసులు బ్రిక్స్ తీసుకొచ్చి పార్కింగ్ లో పెట్టారు. తప్పును కవర్ చేసేందుకు ఇదంతా చేస్తున్నారు. డీసీపీ పద్ధతి బాగోలేకే డింపుల్ గతంలో వార్నింగ్ ఇచ్చింది. ఇదంతా తట్టుకొలేకనే తప్పుడు కేసు పెట్టారు. ఒక పోలీస్ అయ్యుండి ఫాల్స్ అలిగేషన్స్, ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ చెప్తున్నారు అని అన్నారు.

అంతే కాకుండా ఈ పార్కింగ్ వివాదం బయటకు వచ్చిన దగ్గర్నుంచి హీరోయిన్ ఇంట్లోకి ఎవరో తెలియని వాళ్ళు రావడానికి ప్రయత్నిస్తున్నారు. బయటకు వెళ్ళడానికి డింపుల్ భయపడుతుంది. డింపుల్ కి వివిధ నంబర్ల నుండి కాల్స్ వస్తునాయి. డింపుల్ కి ప్రాణ హాని ఉంది. డింపుల్ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. వారిపై 100 కి కాల్ చేసి ఫిర్యాదు చేశాం. డీసీపీ, డ్రైవర్ పైన న్యాయపరమైన యాక్షన్ తీసుకుంటాం. మేము కేసు పెడితే పోలీసులు తీసుకోవట్లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

Also Read : Allu Arjun@Trivikram: బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మరో పాన్ ఇండియా మూవీలో అల్లు అర్జున్!