Site icon HashtagU Telugu

Ram Gopal Varma: వివాదంలో ఆర్జీవీ ‘డేంజరస్’

Rgv

Rgv

భారతదేశపు మొట్టమొదటి లెస్బియన్ థ్రిల్లర్ చిత్రం ‘డేంజరస్’ విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే PVR, ఐనాక్స్ వంటి మల్టీప్లెక్స్‌లు ఈ చిత్రాన్ని ప్రదర్శించడానికి నిరాకరించాయి. దేశవ్యాప్తంగా మరికొన్ని మల్టీపెక్స్ మూవీలు కూడా నో చెప్పాయి. ఈ విషయమై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ LGBT కమ్యూనిటీ మద్దతును కోరడం చర్చనీయాంశమైంది. “ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీసిన సినిమా కాదని చెప్పారు. సెన్సార్ బోర్డ్ దానిని క్లియర్ చేసినప్పటికీ, సుప్రీంకోర్టు సెక్షన్ 377ని రద్దు చేసినప్పటికీ, ఈ మల్టీప్లెక్స్‌లు ఎల్‌జిబిటి కమ్యూనిటీకి వ్యతిరేకం అని ఆర్జీవి అన్నారు. “ఖత్రా”ని ప్రదర్శించడానికి నిరాకరించినందుకు @PVRcinemas, @INOXCINEMAS సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నట్లు స్పష్టంగా ఉంది. #LGBT కమ్యూనిటీని చిన్నచూపు చూస్తున్నారు’’ వర్మ మండిపడ్డాడు.

అయితే థియేటర్ల సమస్య కారణంగా కొన్ని చిత్రాలు ప్రదర్శింపబడలేదు. వర్మ మూవీకి కూడా అలాంటి ఇబ్బందులే ఉన్నాయని పలు థియేటర్స్ యజమాన్యాలు స్పష్టం చేశాయి. వర్మ తన సినిమాని కమ్యూనిటీ ట్యాగ్‌తో మాత్రమే కమర్షియల్‌గా మారుస్తున్నాడని, తమకు ప్రాతినిధ్యం వహించేందుకు ఏమీ చేయలేదని ఎల్‌జీబీటీ కమ్యూనిటీ సభ్యులు ఆరోపిస్తుండగా, వర్మ కేవలం లెస్బియన్ పోర్న్‌పై ఆసక్తి కలిగి ఉన్నాడని, మానవ హక్కుల ప్రస్తావనను మరిచిపోయాడని,  తమ కమ్యూనిటి ఎదుర్కొంటున్న ‘పెళ్లి, ఇతర సామాజిక సమస్యలు’ గురించి సినిమా తీస్తే బాగుండేదని మరికొన్ని వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇప్పటికే డేంజరస్ (మా ఇష్టం)  షూటింగ్ పూర్తై రేపు విడుదల కావాల్సి ఉన్న ఈ మూవీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు రామ్ గోపాల్ వర్మ. థియేటర్లు సహకరించకపోవడంతో తమ చిత్రాన్ని వాయిదా వేస్తున్నామంటూ ఆర్జీవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. సినిమా విడుదలపై కోర్ట్ స్టే ఇవ్వడంతో.. రిలీజ్ పై వెనకడుగు వేశారు వర్మ.