విజయ్ (Vijay) – లోకేష్ కనకరాజ్ (Lokesh) కలయికలో తెరకెక్కిన మూవీ లియో (Leo ). గతంలో వీరిద్దరి కలయికలో మాస్టర్ మూవీ వచ్చి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో మరోసారి వీరి కలయికలో సినిమా అనగానే అంచనాలు తారాస్థాయికి చేరాయి. తమిళనాట విజయ్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. తెలుగు లో పవన్ కళ్యాణ్ కు ఎలాగైతే అభిమానులు , భక్తులు ఉంటారో..తమిళనాట కూడా విజయ్ కి అలాంటి భక్తులే ఉంటారు. హిట్ ,ప్లాప్ లతో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. గత కొద్దీ నెలలుగా వరుస విజయాలతో విజయ్ సునామీ సృష్టిస్తున్నాడు. ఇక ఇప్పుడు లియో తో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే ఈ మూవీ లోబాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ( Sanjay Dutt), అర్జున్ సర్జా (Arjun), త్రిషా కృష్ణన్ (Trisha), గౌతమ్ వాసుదేవ్ మీనన్ ( Gautham Vasudev Menon) తదితరులు ఈ సినిమాలో నటించారు.. మరి ఈ సినిమా ఎలా ఉంది..పబ్లిక్ ఏమంటున్నారు అనేది చూద్దాం. ఇండియా తో పాటు ఇతర దేశాల్లో భారీ ఎత్తున పలు భాషల్లో సినిమా విడుదలైంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు సినిమా అద్భుతంగా ఉందని , లోకేష్ కనగరాజ్ టేకింగ్ నెక్ట్స్ లెవెల్ అని , అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం కూడా ఎప్పటిలాగే అదిరిపోయిందట.
ఫస్టాఫ్ గూస్ బంప్స్ అని, రెట్రో సాంగ్ , కాఫీ షాప్ ఫైట్ మాములుగా లేవని అంటున్నారు. యాక్షన్, కెమెరా, బీజీఎం, స్క్రీన్ ప్లేతో లోకేష్ కనకరాజ్ అదరగొట్టాడు అని చెపుతున్నారు. కాకపోతే త్రిష, సంజయ్ దత్, ప్రియా ఆనంద్, గౌతమ్ వాసుదేవన్ మీనన్ క్యారెక్టర్లు అంత బాగా డీల్ చేయలేదని అంటున్నారు. ఇక ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎక్కక పోవచ్చు అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఎక్కువగా తమిళ వాసనే ఉందని , తెలుగు ప్రేక్షకుల అభిరుచుకి తగ్గట్లు లేదని అంటున్నారు.
Read Also : Bhagavanth Kesari Talk : భగవంత్ కేసరి టాక్ ..